Chandrababu Challenge :రాజకీయాల నుంచి తప్పుకుంటా.. జగన్ కు చంద్రబాబు సవాల్

Chandra babu Challenge To Jagan: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. జగన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. విశాఖ జిల్లా తాళ్లవలస సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 09:15 PM IST

    ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

    దేశంలో ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ

    తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా- బాబు

Chandrababu Challenge :రాజకీయాల నుంచి తప్పుకుంటా.. జగన్ కు చంద్రబాబు సవాల్

Chandra babu Challenge To Jagan: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. విశాఖ జిల్లా తాళ్లవలస సభలో మాట్లాడిన టీడీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రస్తుతం దేశంలో ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు చంద్రబాబు. తాము చేస్తున్న ఆరోపణలను తప్పని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని..  వాళ్ల తానొక సవాల్ విసురుతున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు అధికంగా ఉంటే.. తాను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటానని చంద్రబాబు ప్రకటించారు.

ఏపీలో ఐరెన్ లెగ్ ముఖ్యమంత్రి ఉన్నారని చంద్రబాబు కామెంట్ చేశారు. అన్నింటిమీద పన్నులు వేసి ప్రజల నడ్డి విరిచారని ఆరోపించారు. ఇలాంటి దారుణమైన ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. గతంలో చూడలేదని.. ఇకపైనా చూడబోమని అన్నారు చంద్రబాబు. నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. పెట్రోల్, డిజిల్ ధరలపై పన్నులు ఎందుకు తగ్గించడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రచారం కోసం కోట్ల రూపాయలు వృధా చేశారని.. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు వేసి భ్రష్టు పట్టించారని విమర్శించారు. పదవ తరగతి పరీక్ష పేపర్ల లీక్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు.

రుషికొండకు వెళ్లకుండా తనను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.రుషికొండలో ప్రభుత్వం పర్యాటక ప్రాజెక్టు కడుతుంటే.. తాను చూస్తే ఏమవుతోందని ప్రశ్నించారు. జగన్ డైరెక్షన్ లోనే విశాఖ భూములను వైసీపీ నేతలు స్వాహా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ రెడ్డి కన్ను పడితే చాలు.. ఏదైనా మటుమాయం కావడం ఖాయమన్నారు టీడీపీ అధినేత. టూరిజం ప్లేస్ ను ధ్వంసం చేస్తూ చరిత్రాత్మక రుషికొండ అనవాళ్లు లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ మాత్రమే ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుందని చెప్పారు చంద్రబాబు. జగన్ పాలకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా తమతో కలిసి రావాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

READ ALSO: Ap Ssc Exam Papers Leak: ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రశ్నాపత్రాల లీక్.. టీడీపీపై సీఎం జగన్ సంచలన ఆరోపణలు

Political Heat In Telangana: తెలంగాణలో జాతీయ నేతల టూర్లు..మొదలైన ఎన్నికల జాతర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News