CM Jagan: కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి: సీఎం జగన్

కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని... నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 09:55 PM IST
 CM Jagan: కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి: సీఎం జగన్

CM Jagan: రాష్ట్రంలో కొవిడ్‌(Covid-19) నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లాల కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం(CM Jagan) సమీక్షించారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల(Compassionate appointment) ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

20న నోటిఫికేషన్

ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్‌ను రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌(Notification) జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. జాతీయ ప్రమాణాల ప్రకారం ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.  176 కొత్త పీహెచ్‌సీ(PHC)ల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

Also read: AP Three Capital Issue: మూడు రాజధానులతో కేంద్రానికి సంబంధం లేదు

విద్యుత్ సమీకరించండి

బొగ్గు సరఫరా, విద్యుత్‌పై ప్రణాళిక, దీర్ఘకాలిక వ్యూహాలపై అధికారులతో సీఎం సమీక్ష(CM Review) నిర్వహించారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. థర్మల్‌ ప్లాంట్ల(Thermal Plants)కు బొగ్గు కొరత(Coal Shortage) రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణలోని సింగరేణి, కోల్‌ఇండియాతో సమన్వయం చేసుకోవాలని.. బొగ్గు తీసుకొచ్చే ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News