Cold Waves: తెలంగాణలో చలి మళ్లీ పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చలికి గజ గజ వణికి పోతున్నారు. దీంతో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబర్ నెల మొదట్లో చలి తీవ్రత పెరిగింది. ఆ తర్వాత ఏపీలో తుఫానుల కారణంగా ఉష్ణోగ్రతలు నార్మల్ కు చేరుకున్నాయి. తాజాగా ఇపుడు మరోసారి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రాత్రి సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఉదయం మంచు రోడ్డు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మంచుతో రోడ్లు కనపడక చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై జనాలు చలి మంటలు వేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.
చలి తీవ్రతతో పాటు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా... ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్ఫ్లూయెంజా లక్షణాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్ లో జాగ్రత్తగా మసులుకోవాలని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. చలి గాలిలో తిరగకుండా మఫ్లర్లు, మంకీ క్యాపులతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.