కాకినాడ: మూడు రాజధానులతోనే ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమంటూ అధికార వైఎస్సార్‌సీపీ నేతలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం (జనవరి 11న) భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. చంద్రబాబు తన బినామీల కోసమే బస్సుయాత్రలు చేపడుతున్నారని విమర్శించారు.
Also read: దేశం విడిచి వెళ్లడమే మంచిది: సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు
తనకు చంద్రబాబును బూతులు తిట్టాలని ఉందంటూ పరుషవ్యాఖ్యలతో ద్వారంపూడి రెచ్చిపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన వెదవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మొన్న ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్దిచెప్పారని, ఆ ముసలోడు మళ్లీ లేవకూడదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ శ్రేణులు బాగా పనిచేయాలన్నారు. నారా లోకేష్‌ను పప్పు అని సంబోధిస్తూ విమర్శించారు. స్థానిక ఎన్నికల్లోనూ లోకేష్‌కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలన్నారు.
పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సైతం ద్వారంపూడి నిప్పులు చెరిగారు. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా అని ప్రశ్నించారు. పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అని, కొన్ని పరుష వ్యాఖ్యలతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీ బినామీలను బయటకు తేవాలని, చంద్రబాబు, లోకేష్, పవన్ లను జైల్లో వేయాలంటూ మండిపడ్డారు. అసలు రాజధానిని వెంటనే విశాఖపట్నంకు తరలించాలన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..