త్వరలో రాష్ట్రానికి ఎలక్ట్రికల్ వాహనాలు: సీఎం చంద్రబాబు

త్వరలో దేశంలోనే తొలిసారిగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యావరణహితమైన ఎలక్ట్రికల్‌ బైక్‌లను తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Updated: Apr 13, 2018, 10:01 AM IST
త్వరలో రాష్ట్రానికి ఎలక్ట్రికల్ వాహనాలు: సీఎం చంద్రబాబు

అమరావతి: త్వరలో దేశంలోనే తొలిసారిగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యావరణహితమైన ఎలక్ట్రికల్‌ బైక్‌లను తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని  కాలుష్య రహితంగా ఉంచాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, విద్యుత్‌తో నడిచే వాహనాల వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. మంగళగిరి సీకె కన్వెన్షన్‌ హాల్‌లో హ్యాపీసిటీస్‌ సమ్మిట్‌ 2018 కార్యక్రమంలో రెండవరోజు ముఖ్యమంత్రి పలు దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సదస్సు ఆవరణలో అవేరా సంస్థ ఏర్పాటు చేసిన సౌరశక్తి బ్యాటరీతో నడిచే అవేరా బైకులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరావతిలో నివసించే ప్రజలకు బ్యాటరీ ఆధారంగా నడిచే స్కూటర్లు ఎంతో సౌలభ్యంగా ఉంటాయన్నారు. త్వరలోనే అమరావతిలో బ్యాటరీ వాహనాలు కనువిందు చేయనున్నాయి.

 

సింగపూర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు

ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు గురువారం రాత్రికి సింగపూర్‌ బయల్దేరి వెళ్తున్నారు. హిందూస్థాన్‌ టైమ్స్‌ -మింట్‌ ఆసియా లీడర్‌ షిప్‌ సమ్మిట్‌ 2018 కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. సింగపూర్‌ నుంచి సీఎం తిరిగి 14న అమరావతికి చేరుకుంటారు.