close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

గ్రామ సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ జాబితా విడుదల లింక్

గ్రామ సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ జాబితా విడుదల లింక్

Updated: Sep 22, 2019, 02:05 AM IST
గ్రామ సచివాలయ ఉద్యోగాల మెరిట్‌ జాబితా విడుదల లింక్
File photo

అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకంలో మరో ముందడుగు పడింది. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల మెరిట్‌ జాబితాను  ఆన్‌లైన్‌లో పొందుపర్చినట్టు ఏపీ పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కేటగిరీల వారీగా, పోస్టుల వారీగా, జిల్లాల వారీగా వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ http://gramasachivalayam.ap.gov.in/​​ ‌లో అందుబాటులో ఉంచామని అన్నారు. అభ్యర్థులు వారి హాల్‌ టికెట్‌ నెంబర్ల ఆధారంగా జిల్లాల వారీగా ఆయా పోస్టులకు సంబంధించిన ర్యాంకుల వివరాలను తెలుసుకోవచ్చు. మెరిట్‌ జాబితాను జిల్లా కలెక్టర్లకు కూడా అందజేశాం. ఎంపికైన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపుతాం' అని గిరిజా శంకర్‌ స్పష్టం చేశారు. 

ఇక ఈ నెల 24, 25 తేదీల్లో ధృవ పత్రాల పరిశీలన జరపనుండగా.. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్‌ 2వ తేదీ నుంచి విధుల్లో చేరనున్నారు.