Gulab Cyclone: ఉత్తరాంధ్ర వైపుకు దూసుకొస్తున్న గులాబ్ తుపాను, అతి భారీ వర్షాల హెచ్చరిక

Gulab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుపానుగా మారింది. ఒడిశా తీరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర తీరం వైపుకు దూసుకొస్తోంది. ఏపీలో తీరం దాటనుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2021, 05:04 PM IST
  • బంగాళాఖాతంలో అతితీవ్ర తుపానుగా మారిన గులాబ్ తుపాను
  • ఉత్తరాంధ్రలో తీరం దాటే అవకాశం, అతి భారీ వర్షాల హెచ్చరిక
  • గులాబ్ తుపాను నేపధ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
 Gulab Cyclone: ఉత్తరాంధ్ర వైపుకు దూసుకొస్తున్న గులాబ్ తుపాను, అతి భారీ వర్షాల హెచ్చరిక

Gulab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుపానుగా మారింది. ఒడిశా తీరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర తీరం వైపుకు దూసుకొస్తోంది. ఏపీలో తీరం దాటనుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

బంగాళాఖాతంలో రెండ్రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ తరవాత వాయుగుండం మరింతగా బలపడి గులాబ్ తుపానుగా మారింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 370 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి తూర్పున 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో(Bay of Bengal)ఉన్న గులాబ్ తుపాను గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరంవైపుకు దూసుకొస్తోంది.

గులాబ్ తుపాను(Gulab Cyclone) ఇప్పటికే తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ దిశగా కదులుతూ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయి. దిశ మార్చుకుంటే సోంపేటలోని బారువ వద్ద తీరం దాటనుందని తెలుస్తోంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో , అత్యధికంగా 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains)కురవనున్నాయి. ఇటు కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో మీటర్ ఎత్తువరకూ అలలు ఎగసిపడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది.

తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్ని అప్రమత్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ చెట్లు నేలకొరిగే అవకాశాలున్నాయి. గులాబ్ తుపాను నేపధ్యంలో విశాఖపట్నంలో ఎస్‌డీఆర్ఎఫ్ బృందం, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల్ని ఒక్కొక్కటి చొప్పున సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళం జిల్లాకు మరో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించారు. పోలీసు, రెవిన్యూ, రవాణా, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నెల 27వ తేదీన ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం(Low Depression)ఈనెల 28వ తేదీన ఏర్పడనుందని వాతావరణ శాఖ(IMD)తెలిపింది. 

Also read: AP Government: ఆన్‌లైన్ టికెట్ పోర్టల్ అంటే పవన్‌కు అంత భయమెందుకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News