Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తుపానుగా మారనుందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫలితంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.
ఏపీకు తుపాను హెచ్చరిక(Cyclone Alert) జారీ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ఇవాళ ఉదయం మరింతగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా మారి..ఆ తరువాత తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం(IMD)తెలిపింది. తిరిగి బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందనేది అంచనా.
బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన తుపాను నెల్లూరు సమీపంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత తీరం దాటనుంది. 2008 నవంబర్ 13న నెల్లూరు వద్ద ఒక తుపాను తీరాన్ని దాటింది. తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శుక్రవారం నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతితీవ్రమైన భారీవర్షాలు పడనున్నాయి. ఇక గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మత్స్యకారులకు హెచ్చరిక
తుపాను ముప్పు నేపధ్యంలో ఇప్పటికే విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో రెండు రోజులపాటు తీరం అల్లకల్లోలంగా ఉండనుంది. గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం(Low Pressure) ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏర్పడిన 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: JC, Paritala greet each other: ఒక్కటైన జేసీ, పరిటాల కుటుంబాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను, ఏపీలో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ
ఏపీకు తుపాను హెచ్చరిక జారీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా..తుపానుగా మారే పరిస్థితి
ఈ నెల 13వ తేదీన అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం