ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ విడుదల : టాప్ - 10లో  విజయవాడ, తిరుపతి నగరాలకు చోటు

               

Last Updated : Sep 24, 2018, 08:13 PM IST
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ విడుదల : టాప్ - 10లో  విజయవాడ, తిరుపతి నగరాలకు చోటు

ఢిల్లీ: భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితా కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో విజయవాడ, తిరుపతి నగరాలకు చోటు దక్కింది. తిరుపతి 4వ స్థానంలో ఉండగా.. విజయవాడ 9వ స్థానం దక్కించుకుంది. మహారాష్ట్రలోని పూణె నగరం మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ముంబై నగరంలోని నవీముంబై ఈ జాబితాలో 2వ స్థానంలో, గ్రేటర్ ముంబై 3వ స్థానంలో నిలిచాయి. 5వ స్థానంలో చండీగఢ్, 6వ స్థానంలో థానె, 7వ స్థానంలో రాయపూర్, 8వ స్థానంలో ఇండోర్, 10వ స్థానంలో భోపాల్ ఉన్నాయి. సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరి తొలి సారిగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ను విడుదల చేశారు.

ప్చ్..చేధు నిజాలు
ఈజ్ ఆఫ్ లివింగ్ ర్యాంకుల విడుదల సందర్భంలో కొన్ని చేధు నిజాలు బయటికి వచ్చాయి...తెలంగాణ నుంచి ఏ నగరం ఈ జాబితాలో స్థానం సాధించలేకపోవడం. అలాగే దేశ రాజధాని ఢిల్లీ 65వ స్థానంలో నిలిచింది. చెన్నై 14వ స్థానంతో సరిపెట్టుకుంది. విస్తీర్ణంలో అతిపెద్ద నగరమైన కోల్‌కతా ఈ సర్వేలో పాల్గొనడానికి నిరాకరించిందని పట్టణాభివృద్ధి శాఖ నిరాకరించింది.

ర్యాంకుల ప్రామాణికం ఇదే...
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరి తొలి సారిగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నగరాల జాబితాను విడుదల చేశారు. పరిపాలన, సామాజిక సంస్థలు, ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్రకారం ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ జాబితాను తయారు చేశారు. దేశంలోని మొత్తం 111 నగరాలలో ఈ సర్వే నిర్వహించారు. విభాగాల వారీగా ఏఏ నగరాల్లో ఏ స్థానంలో ఉన్న విషయాన్ని మనం తెలుసుకుందాం....

సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న టాప్ 10 నగరాలు :        

1. నవీ ముంబై
2. తిరుపతి
3. కరీంనగర్
4. హైదరాబాద్
5. బిలాస్ పూర్
6. కోచి    
7. అహ్మదాబాద్
8.  పూణె    
9. విజయవాడ    
10. విశాఖపట్నం

సామాజికంగా బలంగా ఉన్న టాప్ 10 నగరాల జాబితా :

1. తిరుపతి
2. తిరుచిరాపల్లి
3.  నవీ ముంబై
4. చండీగఢ్
5. పూణె
6. గ్రేటర్ ముంబై
7. అమ్రావతి
8. విజయవాడ
9. ఇండోర్
10. వాసై విరార్

ఆర్థికంగా అభివృద్ధి చెందిన టాప్ 10 నగరాలు : 

1. చండీగఢ్
2. అజ్మీర్
3. కోటా
4. ఇండోర్
5. తిరుపూర్
6. ఈటానగర్
7. పూణె
8. లుధియానా
9. థానె
10. విజయవాడ

భౌగోళికంగా సదుపాయాలు కలిగి ఉన్న టాప్ 10 నగరాలు :

1. గ్రేటర్ ముంబై
2. పూణె
3. థానె
4. చండీగఢ్
5. రాయ్ పూర్
6. తిరుపతి
7. నవీ ముంబై
8. భోపాల్
9. బిలాస్ పూర్
10. విశాఖపట్నం

Trending News