Ippatam Village Issue: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం ఇళ్లు, గోడలు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అక్కడ బాధితులకు అండగా నిలిచేందుకు లక్ష రూపాయలు వంతున ఆర్థిక సాయం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారని ఆ పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. నైతిక మద్దతుతోపాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలని రూ.లక్ష సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా బాధితులకు అంజేస్తారని అన్నారు.
ఇప్పట గ్రామంలో ఇళ్లు, గోడలు కూల్చివేత వివాదాస్పదంగా మారింది. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే ఆ గ్రామంలో ప్రభుత్వం కక్ష కట్టి.. ఇళ్లు, గోడలు కూల్చివేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తరువాత ఇప్పటం గ్రామానికి చేరుకుని అక్కడ కూల్చిన ఇళ్లను పరిశీలించారు. ఇప్పటంలో ఇళ్లు కూలిస్తే.. ఇడుపులపాయలో హైవే వేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. రోడ్డు వెడల్పు అంటూ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, నెహ్రూ గారి విగ్రహాలు, ఆఖరికి శివుడికి కాపలాగా ఉండే నంది విగ్రహాన్ని కూడా కూల్చేశారని.. మరి వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చకుండా ఎందుకు వదిలేశారని పవన్ నిలదీశారు. దీనిపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ.. భారీగా ట్రోలింగ్ చేశారు.
అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించి.. ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించింది. క్రేన్ సాయంతో విగ్రహం తరలించారు. గాంధీ, నెహ్రూ మహానుభావుల విగ్రహాలతో పాటు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా తీసేశారు.
తమ పార్టీ సభకు స్థలాన్ని ఇచ్చి ఇబ్బందులు పడుతున్న ఇప్పటం గ్రామ ప్రజలకు నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా సాయం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇటీవల గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యనటతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యపై చర్చ జరిగింది. తాజాగా బాధితులకు రూ.లక్ష సాయం ప్రకటించడంపై జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: America Elections: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. జో బైడెన్‌కు అగ్నిపరీక్ష.. రంగంలోకి ట్రంప్
Also Read: Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో టీమిండియా సెమీస్ పోరు.. ఆ ప్లేయర్‌కు ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook