ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరిస్థితి ఘోరంగా ఉంది. చివరికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలవలేని పరిస్థితిలో ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే పవన్ సొంత నియోజకవర్గమైన భీమవరంలో ఓటమి పాలైనట్లు తెలిసింది. వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ 8 వేల ఓట్ల తేడాతో పవన్ పై విజయం సాధించారు. ఇక గాజువాక విషయానికి వస్తే ఇక్కడ కూడా పోటీ హోరా హోరీ గా సాగుతున్నప్పటికీ ప్రస్తుతం పవన్ కల్యాణ్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కూడా పవన్ ఓటమి పాలైతే జనసేన పార్టీ ఖాతా తెరవని పార్టీగా నిలిచిపోతుంది.