Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై దుమారం, వాలంటీర్లపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన జనసేనాని

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖలు చేశారు. వారాహి రెండవ దఫా యాత్రలో ఈసారి వాలంటీర్లపై వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వివాదాన్ని రాజేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 9, 2023, 11:16 PM IST
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై దుమారం, వాలంటీర్లపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన జనసేనాని

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ పార్టీ అధినేతగా కాకుండా వీధి స్థాయి నేతలా మాట్టాడుతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వాలంటీర్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. 

రెండవ విడత వారాహి యాత్రను ఏలూరు నుంచి ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో వాలంటీర్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. వాలంటీర్లపై వ్యక్గిగతంగా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అదే ఇప్పుడు వివాదాన్ని రాజేస్తోంది. గ్రామాల్లోని వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా, వితంతువులున్నారా లేదా అనే వివరాల్ని సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేసుంటే హుందాగా ఉండేదని అలాకాకుండా వాలంటీర్లపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి చవకబారు రాజకీయాలకు తెరతీశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హ్యమన్ ట్రాఫికింగ్ పనులు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయడంపై అందరూ మండిపడుతున్నారు. రాజకీయ అక్కసుతో ఏం మాట్లాడుతున్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలియడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని..అలాకాకుండా సామాన్య చిరుద్యోగులైన వాలంటీర్లను లక్ష్యం చేసుకోవడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ విదానాలు నచ్చకపోయినా, వైసీపీ నేతలు నచ్చకపోయినా నేరుగా దానిపై విమర్శలు చేయకుండా వాలంటీర్లపై తీవ్రమైన ఆరోపణలు చేయడంపై దుమారం రేగుతోంది. వాలంటీర్ల మనోభావాల్ని పవన్ కళ్యాణ్ ఘోరంగా అవమానించారని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు.

ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఈ తరహా వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ విలువ తగ్గించుకున్నారనే విమర్సలు వస్తున్నాయి. ప్రభుత్వంపై కోపముంటే, వ్యతిరేకత ఉంటే ముఖ్యమంత్రి జగన్ లేదా మంత్రులు లేదా వాలంటీర్ వ్యవస్థను విమర్సించవచ్చు గానీ..ఇలా వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని హననం చేసే వ్యాఖ్యలు చేయడంపైనే అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also read; Ganja Smuggling: చిత్తూరు జిల్లా మదనపల్లిలో భారీగా గంజాయి స్వాధీనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News