బీజేపీలో చేరికపై స్పందిస్తూ ప్రధాని మోదీపై జేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

పార్టీ మార్పుపై తనదైన స్టైల్లో స్పందించిన టీడీపీ మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి

Updated: Nov 18, 2019, 07:08 PM IST
బీజేపీలో చేరికపై స్పందిస్తూ ప్రధాని మోదీపై జేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపిలో చేరుతున్నారా అనే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంపై స్వయంగా జేసి దివాకర్ రెడ్డినే స్పందిస్తూ.. ప్రధాని మోదీపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ మార్పు అంశంపై స్పందించిన జేసి దివాకర్ రెడ్డి.. ''తాను ఇంకా టీడీపీలోనే ఉన్నానని.. బీజేపి క్యాంపెయిన్ చేస్తోన్న ప్రచారంలో నిజం లేదు'' అని అన్నారు. అదే సందర్భంలో ప్రధాని మోదీ పలు మంచి పనులు చేస్తున్నారని జేసి దివాకర్ రెడ్డి కితాబిచ్చారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మొత్తం భారత్‌లో కలిస్తే చూడాలని ఉందన్న కోరికను వెలిబుచ్చిన జేసి.. అదే జరిగిన నాడు తాను తప్పకుండా మోదీని అభినందిస్తానని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా.. ప్రస్తుతానికైతే తాను టీడీపీలోనే ఉన్నానని జేసి మరోసారి స్పష్టంచేశారు.