Jr NTR: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా ఏపీకి గత నెల 13న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం, జనసేన కూటమిగా కలిసి పోటీ చేశాయి. అంతేకాదు ఈ ఎలక్షన్స్ లో అధికార వైసీపీకి గట్టి షాక్ ఇస్తూ అనూహ్య ఫలితాలను సాధించాయి. ఏకంగా తెలుగు దేశం పార్టీ 135 సీట్లు.. జనసేనకు 21, బీజేపీ 8 సీట్లు సాధించాయి. మొత్తంగా కూటమిగా 164 సీట్లు కైవసం చేసుకుంది. ఏపీలో విజయ దుందుభి మోగించిన చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేతకు ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.. వీరితో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, ఇతర పార్టీ నేతలు విజయం సాధించిన కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కూటమి విజయం నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి కూటమి నేతలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
— Jr NTR (@tarak9999) June 5, 2024
అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన @PawanKalyan గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
— Jr NTR (@tarak9999) June 5, 2024
చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన @ncbn మావయ్యకీ, @JaiTDP నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు!
మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను.వరుసగా మూడవ సారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం…
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 5, 2024
జనసేన అధ్యక్షులు @pawankalyan గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 5, 2024
ఈ సందర్బంగా ప్రియమైన చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. మీ ఈ విజయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
మరోవైపు అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి హాట్రిక్ విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి.. MPలు గెలిచిన శ్రీ భరత్ గారికి.. ఎంపీగా విజయం సాధించిన పురంధేశ్వరి అత్తయ్యకు నా శుభాకాంక్షలు అంటూ బెస్ట్ విషెస్ తెలియజేసారు ఎన్టీఆర్.
అలాగే ఈ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ బెస్ట్ విషెస్ తెలియజేసారు.
Also read: AP Assembly Results 2024: ఏపీ ఎన్నికల్లో జనసేన క్లీన్‌స్వీప్, పవన్ సహా ఎవరి మెజార్టీ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook