Lokesh Comments: ఏపీనా..బీహారా..వైసీపీ పాలనపై నారా లోకేష్‌ విసుర్లు..!

Lokesh Comments: ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీనిపై అధికార, విపక్ష పార్టీ నేతలు మాటల యుద్దానికి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 04:32 PM IST
  • ఏపీలో కొనసాగుతున్న మాటల యుద్ధం
  • సుబ్రహ్మణ్యం మృతిపై రచ్చ
  • వైసీపీ పాలనపై లోకేష్‌ మండిపాటు
Lokesh Comments: ఏపీనా..బీహారా..వైసీపీ పాలనపై నారా లోకేష్‌ విసుర్లు..!

Lokesh Comments: ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీనిపై అధికార, విపక్ష పార్టీ నేతలు మాటల యుద్దానికి దిగారు. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై ఫైర్ అయ్యారు. ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రలో వైసీపీ మాఫీయా రాజ్యమేలుతోందన్నారు. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకు సామాన్యులు బలవుతున్నారని విమర్శించారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అత్యంత దారుణంగా చంపి..యాక్సిడెంట్‌గా ఎమ్మెల్సీ అనంతబాబు చిత్రీకరిస్తున్నారన్నారు లోకేష్. 

ఈ ఘటనే వైసీపీ పాలన నిదర్శనమని చెప్పారు. దీనిపై ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదన్నారు. నిందితులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు విచ్చలవిడిగా హత్య రాజకీయాలు చేయాలని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా అని మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబసభ్యులను ఆదుకోవాలన్నారు. 

కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం దొరకడం తీవ్ర కలకలం రేపింది. మృతుడు ఎమ్మెల్సీ అనంత బాబు(MLC ANANTHA BABU) వద్ద పనిచేస్తున్న డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. హత్య చేసి..రోడ్డుప్రమాదంగా చెబుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్వయంగా ఎమ్మెల్సీ తన కారులో మృతదేహాన్ని తీసుకొచ్చి కుటుంబసభ్యులకు ఇవ్వడంపై పలు అనుమానాలు కల్గుతున్నాయి. దీంతో మృతదేహంతో అతడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also read:Venkatesh Remuneration: 'ఎఫ్ 3'కి మూడురెట్ల పారితోషికం.. వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Also read:Pawan Kalyan Tour: తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి..నేతలకు పవన్‌ కళ్యాణ్‌ పిలుపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News