Pawan Kalyan Tour: తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి..నేతలకు పవన్‌ కళ్యాణ్‌ పిలుపు..!

Pawan kalyan Tour: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ జోరు పెంచారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు ఏపీపై దృష్టి పెట్టిన ఆయన..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేశారు. జనసైనికుల్లో జోష్‌ నింపేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పవన్ పర్యటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 03:56 PM IST
  • జోరు పెంచిన పవన్ కళ్యాణ్
  • తెలుగు రాష్ట్రాలపై ఫోకస్
  • తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ
Pawan Kalyan Tour: తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి..నేతలకు పవన్‌ కళ్యాణ్‌ పిలుపు..!

Pawan kalyan Tour: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ జోరు పెంచారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు ఏపీపై దృష్టి పెట్టిన ఆయన..ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ చేశారు. జనసైనికుల్లో జోష్‌ నింపేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో పవన్ పర్యటించారు. రోడ్డుప్రమాదంలో మృతి చెందిన కొంగరి సైదులు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా రూ.5 లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆయన మంతనాలు జరిపారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో జనసేన జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్. తెలంగాణలో గెలుపు ఓటములను జనసేన ప్రభావితం చేస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనసేన ఓట్లు ఉన్నాయని చెప్పారు. 

సామాజిక మార్పు తన లక్ష్యమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రలో అధికారం ఆశించలేదని..తెలంగాణలో ఎలా ఆశిస్తాని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు తానే వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని పిలుపునిచ్చారు. ఓటమికి కుంగిపోనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ఇప్పటివరకు ఏపీపై ఫోకస్‌ చేసిన ఆయన..తెలంగాణలో పర్యటించడంతో రాజకీయాలు హీటెక్కాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో  రాజకీయంగా  పోటీ నెలకొంది. టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సైతం ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేరారు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా..లేక ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తారా అన్న చర్చ జరుగుతోంది. 

గతంలో సీఎం కేసీఆర్‌(CM KCR)ను పవన్ కళ్యాణ్‌ కలిశారు. ఈసందర్భంగా ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. టీఆర్ఎస్‌తో కలిసి ముందుకు వెళ్లొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ, పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా జనసేన(JANASENA)తో టీఆర్ఎస్‌ కలిపి పనిచేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా పవన్ టూర్‌తో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది.

Also read:Disha Case: సిర్పుర్కర్ కమిషన్‌ నివేదిక తేటతెల్లం..పోలీసుల గుండెల్లో రైళ్లు..!
Also read:Virat Kohli Record: విరాట్ కోహ్లీ రేర్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే 'ఒకే ఒక్కడు'!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News