లోకేష్ పోలింగ్ బూత్ కు వెళ్లడాన్ని తప్పుబడుతూ వైసీపీ చీఫ్ జగన్ చేసిన విమర్శలపై నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. పోలింగ్ బూత్ కు వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని జగన్ అంటున్నారు...పోలింగ్ తీరును పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుంది... పోలింగ్ సవ్యంగా జరుగుతోందో లేదో పరిశీలించేందు వెళితే అది తప్పెందుకు అవుతుందో అర్థకావడం లేదు... కనీస పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి సీఎం కావాలనుకుంటున్నారని... మన రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం మన ఖర్మ కాకపోతే ఇక్కేంటి..? అంటూ జగన్ పై లోకేష్ సెటైర్లు వేశారు.
పోలింగ్ రోజున నేను పోలింగ్ బూత్ కి వెళ్ళడం నిబంధనలకు విరుద్ధమని జగన్ అన్నారు. పోలింగ్ సవ్యంగా జరుగుతుందో లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటే మన ఖర్మ అనుకోవాలి. https://t.co/0jJgSKoYbH
— Lokesh Nara (@naralokesh) April 17, 2019
కోడి కత్తి దాడి ప్రస్తావన..
మొన్నెప్పుడో పేపర్లో చదివా ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచీ బతికేస్తుందంట. జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి ! అంటూ జగన్ పై లోకేష్ సెటైర్ వేశారు
మొన్నెప్పుడో పేపర్లో చదివా ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచీ బతికేస్తుందంట. జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి!
— Lokesh Nara (@naralokesh) April 17, 2019