Nagababu In AP Cabinet: మెగా బ్రదర్.. జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్నన్నయ్య నాగబాబుకు ఏపీ క్యాబినేట్ బెర్త్ కన్ఫామ్ అయింది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించాడు. నాగబాబుకు జనసేన తరుపున రాజ్యసభకు నామినేట్ అవుతారనే ప్రచారం జరిగింది. తీరా ఈ మూడు సీట్లు వేరే వాళ్లకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన తరుపున నాగబాబుకు సముచిత స్థానం ఇచ్చే నేపథ్యంలో ఆయన్ని క్యాబినేట్ లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
ఇక కూటమి తరుపున మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దర్ని కూటమి అధిష్టానం ఎంపిక చేసింది. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసారు. మరోవైపు బీజేపీ తరుపున ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు పంపించారు.
ఇక జనసేన అధ్యక్షుడు, AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మార్చి తరువాతే మంత్రి పదవి వచ్చే అవకాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాతే ఆయనకు మంత్రి పదవి వస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఒకవేళ మంత్రిగా చేసినా.. ఆరు నెలల్లో ఏదో ఒక సభలో సభ్యుడైతే చాలు. ప్రస్తుతం సంక్రాంతి పీడ దినాలు నడుస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలున్నాయి. ఇవన్ని కొలిక్కి వచ్చిన తర్వాత మార్చిలో నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ నేపథ్యంలో... ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికకు ఇప్పుడున్న మార్గాలేమిటన్న చర్చ సాగుతోంది. YCP కి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు కొన్ని నెలల కిందటే రాజీనామా చేశారు. గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన బల్లి కల్యాణ్‌చక్రవర్తి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ వీరిలో ఉన్నారు. వారి రాజీనామాలను మండలి ఛైర్మన్ వెంటనే ఆమోదిస్తే ఇప్పటికే ఆ స్థానాలకు ఉప ఎన్నికలొచ్చి, నాగబాబుకు అవకాశం దక్కేది. కానీ, ఆ నలుగురి రాజీనామాలు ఇప్పటి వరకూ ఆమోదం పొందలేదు. ఈ జాప్యం ఇలాగే కొనసాగితే.. మార్చి 29న ఖాళీ అయ్యే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.