Munna Gang Case: కిల్లర్ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష, ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

Killer Munna Gang Case: 2008లో కలకలం రేపిన హత్యల కేసులో నిందితులలో 12 మందికి ఉరిశిక్ష, మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 8వ అదనపు సెషన్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 13 ఏళ్ల తరువాత నిందితులకు శిక్షఖరారు చేశారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 24, 2021, 05:49 PM IST
  • 13 ఏళ్ల కిందట ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన లారీ డ్రైవర్లు, క్లీనర్ల హత్యలు
  • 2008లో జరిగిన హత్యల కేసులో కిల్లర్ మున్నా గ్యాంగ్‌కు ఉరిశిక్ష విధించిన కోర్టు
  • కేవలం 3 కేసులలో తీర్పు వెల్లడి, మరిన్ని పెండింగ్‌లో మరిన్ని కేసుల విచారణ
Munna Gang Case: కిల్లర్ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష, ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

Munna Gang Case Updates: ప్రకాశం జిల్లాలో సంచలనం రేపిన హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. 2008లో కలకలం రేపిన హత్యల కేసులో నిందితులలో 12 మందికి ఉరిశిక్ష, మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 8వ అదనపు సెషన్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

దాదాపు 13 ఏళ్ల కిందట ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై సిమెంట్, ఐరన్ లోడ్‌లతో వెళ్తున్న లారీలు లక్ష్యంగా చేసుకుని మున్నా గ్యాంగ్ దాడులు జరిపేది. ఆపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హత్యచేసి, సరుకును మాయం చేసేవారు. లారీలను సైతం తుక్కుగా మార్చి అమ్మేసేవారు. అయితే జాతీయ రహదారిపై లారీలు, సిబ్బంది అదృశ్యం కావడం కేసులలో ఏం జరుగుతుందో పోలీసులకు సైతం అంతుచిక్కలేదు. ఈ క్రమంలో అప్పట్లో ట్రెయినీ డీఎస్పీగా పనిచేస్తున్న దామోదర్‌కు కొన్ని ఆధారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టగా అబ్దుల్ సమద్ అనే వ్యక్తి మున్నాగా పేరు మార్చుకుని తన గ్యాంగ్‌తో దోపిడీలకు పాల్పడేవాడని తేలింది.

Also Read: Yaas Cyclone Update: మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న యాస్ తుపాను

గుప్త నిధుల అని నమ్మించి ప్రకాశం జిల్లాలో ధనవంతుల నుంచి భారీగా సొమ్ము కాజేయడం లాంటి పనులు చేస్తూనే మరోవైపు లారీల లోడ్‌లపై కన్నేసేవారు. తాము అధికారులమని లారీ, లోడ్‌కు సంబంధించిన పత్రాలు చూపించాలని అడిగేవారు. అంతలోనే లారీ డ్రైవర్లు, క్లీనర్లపై దాడిచేసి మెడకు తాడు బిగించి హతమార్చేవారు. ఓ కేసు విచారణలో భాగంగా మున్నాను, అతడి గ్యాంగ్‌ను అరెస్ట్ చేయగా.. కొందరు కిల్లర్ గ్యాంగ్‌కు సహకరించాలని యత్నించారు. పూర్తి ఆధారాలు లభ్యం కావడం, విషయం వార్తా పత్రికలలో రావడంతో ఆ పెద్దలు వెనక్కి తగ్గారు. 

Also Read: Krishpatnam medicine: ఆయుర్వేదానికి ఐసీఎంఆర్‌కు సంబంధం లేదు

బెయిల్ రావడం ఆలస్యం మున్నా కర్ణాటక(Karnataka)కు పారిపోయి బెంగళూరులో తలదాచుకున్నాడు. మరికొన్ని రోజులకు కర్నూలు పోలీసుల చేతికి చిక్కడంతో పాత కేసుల విచారణ మొదలైంది. మున్నాపై, అతడి అనుచరులపై పలు జిల్లాల్లో కేసులు నమోదుకాగా, తాజాగా ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్ కోర్టు వాదనలు ముగియడంతో 3 కేసులలో శిక్ష ఖరారు చేసింది. మరికొన్ని కేసులలో విచారణ పెండింగ్‌లో ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News