రైతు కోటయ్య మృతి ఘటనపై వైసీపీ అధినేత జగన్ ట్వీట్ పై నారా లోకేష్ స్పందించారు. రైతు మృతి ఘటనకు సంబంధించిన ఓ ఫోటో పోస్టు చేసి ఆ రైతు ప్రాణాలు కాపాడేందుకు తీసుకెళ్తున్న పోలీసులు ఎవరు ? మోదీ పంపారా? అంటూ జగన్ కు లోకేశ్ ప్రశ్నించారు. అలాగే కోటయ్యను బీసీ రైతు అని జగన్ నొక్కి చెబుతున్నారు..మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడమా ! జగన్-మోదీ కుల రాజకీయం చేస్తున్నారు అంటూ లోకేష్ నిలదీశారు. గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతికి సీఎం చంద్రబాబు, పోలీసులే కారణమంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ ఈ విధంగా ఖండించారు.
జగన్ ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా కొన ఊపిరితో ఉన్న కోటయ్యను మోసుకెళ్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. జగన్-మోదీ కుల రాజకీయం చేస్తున్నారని...కోటయ్యను బీసీ రైతు అని నొక్కి చెబుతున్న జగన్, మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. రైతు ప్రాణం కాపాడేందుకు భుజాల మీద కోటయ్యను మోసుకెళ్తున్న పోలీసులు ఎవరు ? ప్రధాని మోదీ పంపారా? అని జగన్ ని లోకేష్ ప్రశ్నించారు. లోకేస్ ట్వీట్ పై వైసీపీ ఎలా స్పందిస్తుందో మరి వేచి చూడాల్సిందే...
జగన్ - మోడీ కుల రాజకీయం: కొండవీడులో రైతు కోటయ్య మృతి ఘటనపై ట్వీట్ చేస్తూ, కోటయ్యను ఒక బీసీ(ముత్రాసి) రైతు అని నొక్కి చెప్పారు జగన్. మనిషి ప్రాణానికి కూడా కులాన్ని జత చేయడం జగన్ కే చెల్లింది. pic.twitter.com/1gyyDJ856x
— Lokesh Nara (@naralokesh) February 21, 2019