MLA Alajangi Jogarao: వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం.. పల్లకిలో ఊరేగింపు.. ఎందుకంటే..?

Parvathipuram YSRCP MLA Alajangi Jogarao: పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై బలిజిపేట మండలం పి.చాకరాపల్లి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ గ్రామానికి రోడ్లు వేసినందుకు గ్రామంలో ఊరేగింపు చేసి పూలవర్షం కురిపించారు. అనంతరం బిందేలతో పాలభిషేకం నిర్వహించి.. కృతజ్ఞతలు చెప్పారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Jun 11, 2023, 08:00 PM IST
MLA Alajangi Jogarao: వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం.. పల్లకిలో ఊరేగింపు.. ఎందుకంటే..?

Parvathipuram YSRCP MLA Alajangi Jogarao: ప్రజలకు ఇచ్చిన హామీని నిల‌బెట్టుకున్న వై‌సీపీ ఎమ్మెల్యేకు ప్రజలు ఘన సత్కార చేశారు. తమ ఊరికి రోడ్లు వేయించడంతో ఊరేగించి.. పాలాభిషేకం కూడా నిర్వహించారు. ఎమ్మెల్యేపై గ్రామస్తులు తమ అభిమానం చాటుకున్నారు. ఇక ప్రజల అభిమానాన్ని చూసిన ఎమ్మెల్యే భావోద్వేగానికి గురవ్వడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ గ్రామానికి చిరకాల వాంఛ నెరవేరడంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట మండలం పి.చాకరాపల్లి ప్రజలు ఎమ్మెల్యే అలజంగి జోగారావును భారీ సన్మానం చేసి.. కృతజ్ఞత చాటుకున్నారు. తమ గ్రామానికి ఎప్పటికీ రోడ్డు చూడలేమని అనుకున్నామని.. కానీ ఎమ్మెల్యే చొరవతో సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పి.చాకరాపల్లి గ్రామానికి గత 50 ఏళ్లుగా రోడ్డు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి అవసరానికి కూడా గ్రామం దాటాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ నాయకులు రావడం.. రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకోవడం.. ఆ తరువాత మొహం చాటేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. 2019 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి వై‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా అలజంగి జోగారావు.. గత పాలకులు మాదిరి కాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 

తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజల చిరకాల కోరికను తీర్చారు. చెప్పినట్లుగానే గ్రామానికి రూ.2.80 కోట్లతో నాలుగు కిలో మీటర్ల మేరకు రోడ్లు వేయించారు. ఈ గ్రామంలో 300 కుటుంబాలు నివాసిస్తుండగా..  తమ దశాబ్దాల కల నెరవేరిందని ఆనందం పడిపోతున్నారు. తమ గ్రామానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావును సన్మానించేందుకు తమ గ్రామానికి సాధారంగా ఆహ్వానించారు. మేళ, తాలలతో గ్రామం అంతా ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపిస్తూ ఊరేగించారు. అనంతరం పాల బిందెలతో మహిళలు పాలాభిషేకం చేశారు. ప్రజలు చూపించిన అభిమానానికి భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే జోగారావు.. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సన్మానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహకారంతో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చానని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తక్కువ కాలంలోనే 2.80 కోట్ల రూపాయల నిధులతో గ్రామానికి 4.5 కిలోమీటర్ల మేర బిటి రోడ్డు మంజూరు చేయించానని తెలిపారు. రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ మధ్యలోనే చేతులెత్తేసినా.. ప్రజల కోరిక తీర్చాలని ప్రత్యేక చొరవ తీసుకుని మరో కాంట్రాక్టర్‌ను తీసుకువచ్చామని అన్నారు. రోడ్లు ప్రారంభించడం గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ  

Also Read: Ind VS Aus WTC Final 2023: మ్యాచ్‌ మధ్యలో అమ్మాయికి లిప్ కిస్.. నెట్టింట వీడియో వైరల్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News