Pawan Kalyan: వాళ్లకే దత్తపుత్రుడిని.. తెలుగు ప్రజల కోసం నారసింహ సందర్శన యాత్ర : పవన్ కల్యాణ్

Pawan Kalyan Commments on CM YS Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి... తనను దత్తపుత్రుడు అనడంపై.. ఏపీలోని ఉద్యోగుల సమస్యపై అలాగే తెలుగు ప్రజల కోసం త్వరలో తాను చేపట్టబోయే యాత్ర గురించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అవి ఏమిటో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 12:16 AM IST
  • తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం పవన్‌ కల్యాణ్ నారసింహ సందర్శన యాత్ర
  • జనసేన సోషల్‌ మీడియా వింగ్‌ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించిన జన సేనాని
  • దత్తపుత్రుడు అంశంపై స్పందించి పవన్
  • ఉద్యోగుల సమస్యను విపక్షాలు సృష్టించలేదని స్పష్టం చేసిన పవన్‌ కల్యాణ్
Pawan Kalyan: వాళ్లకే దత్తపుత్రుడిని.. తెలుగు ప్రజల కోసం నారసింహ సందర్శన యాత్ర : పవన్ కల్యాణ్

Pawan Kalyan Narasimha Sandharshna Yatra: తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం వారు మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ.. నారసింహ సందర్శన యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. తాజాగా జనసేన సోషల్‌ మీడియా వింగ్‌కు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పవన్‌ మాట్లాడారు. 

ఏపీ సీఎం జగన్... తనని దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తున్నారనే ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులకు తానే ఒకటే చెప్పదల్చుకున్నానని ఆయన అన్నారు. తాను ప్రజలకు దత్తత పుత్రుడని పవన్ స్పష్టం చేశారు.

ఇక ఉద్యోగుల సమస్య అనేది విపక్షాలు సృష్టించిది కాదని ఆయన వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ను రద్దు చేస్తాం.. వేతనాలు పెంచుతామంటూ వారికి హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అందువల్లే ఉద్యోగులు వారికి రావాల్సినవి వారు అడుగుతున్నారని పవన్ పేర్కొన్నారు. పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల ఆగ్రహంతో ఉద్యోగులు నిరసనలు చేపడితే... జనసేనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఆ పార్టీ నేతలు ఏం చేసినా ఎవరూ అడగకూడదనే ఉద్దేశంలో ఉన్నారన్నారు. వారు ఏం చేసినా కూడా డూడూ బసవన్నలాగా తల ఊపాలని కోరుకుంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒకవేళ కాదంటే మాత్రం అందరూ వారికి శత్రువుల్లా కనిపిస్తారని పవన్ పేర్కొన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డికి తన కామెంట్లు ఇబ్బంది కలిగించినట్లుగా అనిపిస్తోందని.. ఆధిపత్య ధోరణి అనే మాట ఆయనకు నచ్చలేదేమోనని పవన్ అన్నారు. ప్రభుత్వం సరిగ్గా ఉంటే ఉద్యోగులు రోడ్లపైకి ఎందుకొస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రులంతా కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్‌ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వం సమర్థంగా పని చేయాలని మాత్రమే తాము కోరుకుంటామన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి, వారి శ్రేయస్సు కోసం అనుష్టుప్‌ నారసింహ దర్శన యాత్రకు సంకల్పించినట్లు పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. దశల వారీగా ఈ నరసింహ క్షేత్రాల సందర్శన యాత్ర కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇక తనని గతంలో విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడిన కొండగట్టు ఆంజనేయ స్వామిని త్వరలోనే దర్శించుకుంటానని పవన్ పేర్కొన్నారు.

Also Read: AP new districts: 'విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలి.. లేదంటే ఉద్యమిస్తాం'!

Also Read: YS Jagan Fires on CBN: వారి ముందు ఎర్రజెండా... వెనుకేమో పచ్చ జెండా ఉంటుందన్న ఏపీ సీఎం జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News