Pawan Kalyan Complaint Against CI Anju Yadav: పోలీసులకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక.. జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..

Pawan Kalyan Complaint Against Srikalahasti CI Anju Yadav: జనసేన కార్యకర్త కొట్టె సాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా... ఎలాంటి మారణాయుదాలు ధరించకుండా శాంతియుత పద్ధతిలో నిరసన చేపట్టడం జరిగింది. ఇది దేశంలో ప్రతీ ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. సాయి కూడా అదేవిధంగా శాంతియుతంగా నిరసన చేపట్టారు. అయినప్పటికీ స్థానిక సిఐ అంజూ యాదవ్ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టడం జరిగిందన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2023, 05:41 AM IST
Pawan Kalyan Complaint Against CI Anju Yadav: పోలీసులకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక.. జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..

Pawan Kalyan Complaint Against Srikalahasti CI Anju Yadav: తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ అక్కడి స్థానిక జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతికి వచ్చి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఘటనపై జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని అన్నారు. జనసేన కార్యకర్త కొట్టె సాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా... ఎలాంటి మారణాయుదాలు ధరించకుండా శాంతియుత పద్ధతిలో నిరసన చేపట్టడం జరిగింది. ఇది దేశంలో ప్రతీ ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. సాయి కూడా అదేవిధంగా శాంతియుతంగా నిరసన చేపట్టారు. అయినప్పటికీ స్థానిక సిఐ అంజూ యాదవ్ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టడం జరిగిందన్నారు. 

జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ పరిరక్షిండంలో అంతే క్రమశిక్షణతో ఉండాలి. పోలీసులకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంటుంది... దాన్ని ఒక స్థాయి వరకు అర్థం చేసుకుంటాం. కానీ ఇలా మీ ఇష్టానికి దాడులకు పాల్పడుతాం అంటే ఊరుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ ఫిర్యాదుపై స్పందించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి
శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదుపై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ మా ఆఫీస్ కు వచ్చి సీఐ అంజూ యాదవ్ పై ఫిర్యాదు ఇచ్చారని.. జనసేన పార్టీ కార్యకర్తను అకారణంగా చేయిచేసుకున్న నేరం కింద సీఐ అంజూ యాదవ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు శాఖా పరమైన విచారణకు ఆదేశాలించాల్సిందిగా కోరారు అని తెలిపారు. 

ఈ ఏడాది 2023 జూన్ 30 వరకు తిరుపతి జిల్లాలో 2,123 మంది అదృశ్యం అయ్యారు. వారిలో 2085 మంది ఆచూకీ లభించింది. మిగతా 94 మంది ఆచూకీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం  26098 మహిళలు అదృశ్యం అయినట్లు ఎన్.సి.ఆర్.బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) వద్ద కేసులు రిపోర్ట్ అయ్యాయి. అందులో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 23,390 మందిని గుర్తించాం. మిగిలిన మరో 2705 మందిని గుర్తించాల్సి ఉంది అని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. 

ఇలాంటి ఘటనలను నిరసిస్తూ సీఎం వైఎస్ జగన్ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేసే సమయంలోనే పోలీసులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన కూడా చోటుచేసుకుంది అని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పష్టంచేశారు. శ్రీకాలహస్తి సీఐ అంజూ యాదవ్ ని, జనసేన పార్టీ కార్యకర్త కొట్టె సాయిని ఇద్దరిని పిలిచి విచారణ జరిపిస్తాం. ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశాము.. విచారణ అనంతరం ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం అని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఇప్పటికీ ఇంకా సీఐ అంజూ యాదవ్ కి ఎలాంటి చార్జి మెమో ఇవ్వలేదన్న ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి.. హెచ్.ఆర్.సి నుంచి నోటీస్ అందిందని.. ఆ నోటీసులకు సమాధానం ఇస్తాం అని స్పష్టంచేశారు.

Trending News