close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

జనసేనను విలీనం చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు.. కానీ : పవన్

జనసేనను విలీనం చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు.. కానీ : పవన్

Updated: Aug 16, 2019, 08:16 PM IST
జనసేనను విలీనం చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు.. కానీ : పవన్

విజయవాడ: జనసేన పార్టీని మరో రాజకీయ పార్టీలో విలీనం చేస్తారంటూ గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను మరో పార్టీలో విలీనం చేసే ఆలోచనే లేదని స్పష్టంచేశారు. జనసేన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమావేశమైన సందర్భంగా పవన్  మాట్లాడుతూ.. జాతి సమగ్రతని కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు.