వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తనపై జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా మందికి బాధ కలిగించినట్టుగా తన దృష్టికి వచ్చిందని ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించిన పవన్ కల్యాణ్.. తాను ఎవ్వరి వ్యక్తిగత జీవితాల జోలికి పోయే మనిషిని కాదు అని స్పష్టంచేశారు. రాజకీయ లబ్ధి కోసం ఒకరి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని తేల్చిచెప్పిన పవన్ కల్యాణ్.. తన పార్టీ కార్యకర్తలు, అభిమానులు సైతం వైఎస్ జగన్ గారిని కానీ వారి కుటుంబసభ్యులను కానీ ఆ ఇంటి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
My appeal to all: pic.twitter.com/wxslQvF0Lx
— Pawan Kalyan (@PawanKalyan) July 26, 2018
నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన సినిమా హీరోలు మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుని, భార్యలకు విడాకులు ఇస్తూ జనానికి ఎటువంటి సందేశం ఇస్తారని అంతకు ముందు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా ఈ ప్రకటన విడుదల చేశారు.