వివాదంగా మారిన రాఫెల్ ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. రాఫెల్ కుంభకోణంపై ప్రధాని జాతికి క్షమాపణ చెప్పి వివరణ ఇవ్వాలన్నారు. తనను విమర్శించే వైసీపీ నేతలకూ ప్రజలు బుద్ధి చెబుతారని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ.. 'రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలి. దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలి. అలాగే నన్ను విమర్శించే వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నా.. నీతికి నిలబడే నాపై విమర్శలు చేస్తే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారన్నది గుర్తుంచుకోవాలి.' అని అన్నారు.
శనివారం ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాలో పర్యటించారు. అక్కడ పులికనుమ, గోరుకల్లు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అలాగే గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) హెడ్ రెగ్యులేటర్ దగ్గర జలహారతి ఇచ్చారు. అనంతరం అవుకు కుడి టన్నెల్ ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్‌కి విడుదల చేశారు. అనంతరం కొలిమిగుండ్లలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘రాఫెల్ వ్యవహారంలో మోదీ.. సైనికుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలి. దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలి. అలాగే నన్ను విమర్శించే వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నా.. నీతికి నిలబడే నాపై విమర్శలు చేస్తే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారన్నది గుర్తుంచుకోవాలి. pic.twitter.com/pjdCNAweVo
— N Chandrababu Naidu (@ncbn) September 22, 2018