Revanth Reddy Tirumala: తిరుమలలో రేవంత్‌ రెడ్డి మనవడి పుట్టెంట్రుకలు.. భక్తులతో కొండ కిటకిట

Revanth Reddy Tirumala Tour For Grand Son Tonsuring Ceremony: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో తిరుమల పర్యటనకు వచ్చారు. మనవడి పుట్టెంట్రుకలు తీయించి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 22, 2024, 10:34 AM IST
Revanth Reddy Tirumala: తిరుమలలో రేవంత్‌ రెడ్డి మనవడి పుట్టెంట్రుకలు.. భక్తులతో కొండ కిటకిట

Revanth Reddy Tirumala Tour: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలిసారి రేవంత్‌ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. తన మనవడి పుట్టెంట్రుకల వేడుక కోసం కుటుంబసమేతంగా తిరుమలకు వచ్చారు. మంగళవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయన కుటుంబం అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండపైకి చేరుకున్నారు. తెల్లవారుజామున మనవడు రేయాన్స్‌ పుట్టెంట్రుకలు తీయించారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని రేవంత్‌ కుటుంబం దర్శించుకుంది.

Also Read: KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్‌ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

 

వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఉదయం 8.30 గంటలకు దర్శనానికి ఆలయంలోకి వెళ్లారు. రేవంత్‌ రెడ్డి పర్యటనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిబంధనలకు అనుగుణంగా టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి దగ్గరుండి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. మనవడు రేయాన్స్ కు పుట్టెంట్రకులు తీయించి స్వామివారికి రేవంత్ కుటుంబం మొక్కులు చెల్లించుకుంది. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.

Also Read: Telangana Song: తెలంగాణ ఆవిర్భావ కానుక.. ఎంఎం కీరవాణి స్వరకల్పనలో కొత్తగా పాట

భక్తుల రద్దీ
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వారం రోజులుగా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. బయట క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా తలనీలాలు, హుండీ ఆదాయం భారీగా సమకూరుతోంది. టోకన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 80,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,726 మంది‌ భక్తులు తలనీలాలు సమర్పించగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.67 కోట్లు వచ్చింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News