బ్రేకింగ్: ఎన్డీయేతో టీడీపీ తెగదెంపులు !

బీజేపీతో టీడీపీ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

Last Updated : Mar 16, 2018, 10:27 AM IST
బ్రేకింగ్: ఎన్డీయేతో టీడీపీ తెగదెంపులు !

అమరావతి: ఇప్పటికే కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగిన టీడీపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని టీడీపీ పోలిట్ బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం టీడీపీ ఎంపీలు, పోలిట్ బ్యూరో సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సభ్యులందరూ ఎన్డీయే నుంచి వైదొగితేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ కూటమి నుంచి వైదొలగాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షాకు లేఖ రాయాలని నిర్ణయించారు. తాము ఎందుకు పొత్తుపెట్టుకున్నాం.. ఎందుకు వైదొలగడానికి గల కారణాలను వివరించనున్నారు. అలాగే ఈ విషయాన్ని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు  ఈ విషయాన్ని తెలియజేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్డీయే నుంచి చంద్రబాబు వైదొలగడంతో భవిష్యత్తు పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

 

Trending News