TDP leader chandrababu naidu on elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సునామీ క్రియేట్ చేసిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ముఫ్లై ఏళ్ల విధ్వంసం జరిగిందని చంద్రబాబు జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అహాంకారం, నియంతృత్వ పోకడలను ప్రజలు ఉపేక్షించరని బాబు అన్నారు. దేశం, ప్రజలు మాత్రమే శాశ్వతమని, కానీ రాజకీయాలు అశాశ్వతమన్నారు. ఈసారి ప్రజలు వినూత్న రీతిలో ఓటు అనే ఆయుధంద్వారా రిజల్ట్ ఇచ్చారన్నారు. అవినీతికి పాల్పడిన వారికి, విధ్వంసకారులకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఏపీలో ఓటు వేయడానికి సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ విదేశాల నుంచి వచ్చారని, పక్కా రాష్ట్రాల నుంచి వచ్చారని చంద్రబాబు అన్నారు.
Read more: Instant Karma: కర్మ ఫలం అంటే ఇదేనేమో.. చైన్ స్నాచర్స్ కు రోడ్డుమీద దిమ్మతిరిగే షాక్.. వీడియో వైరల్..
ప్రజలు మంచి నాయకుడి కోసం తమ వంతూ బాధ్యతను సక్రమంగా నిర్వహించారన్ని చంద్రబాబు అన్నారు. కూటమిని గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్త, నేతలు, పార్టీల నాయకులు ప్రతిఒక్కరికి పేరుపేరునున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఐదేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు నిద్రపోని రాత్రులు గడిపారని, అక్రమంగా కేసులు పెట్టి జైలుకు తరలించారన్నారు. కేసు ఏంటి అని అడిగితే.... ముందు అరెస్టుచేసి ఆ తర్వాత చెప్తామని పోలీసులు జులుంచేశారని అన్నారు. కూటమికి 58.38 శాతం వచ్చిందని, దీనిలో టీడీపీకి 45 శాతం, 39 శాతం వైసీకీ వచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు చరిత్రలో లిఖించదగ్గ గొప్ప విజయంను తమకు ఇచ్చారని చంద్రబాబు అన్నారు.
ఈ విజయం ఏపీ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖంచదగ్గ విజయమని అన్నారు. ఐదేళ్లలో ఏపీ అంతా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. వ్యవస్థలన్ని భ్రష్టుపట్టిపోయాయన్నారు. ఎకానమికోలాప్ప్ అయిందని, సహాజ సంపద నాశనమైందని చంద్రబాబు అన్నారు. నాపై, నా కుటుంబంపై, నాభార్యపై, పార్టీపై వేధింపులను గురిచేసేలా కామెంట్లు చేశారని చంద్రబాబు అన్నారు. అలిపిరి బాంబు దాడి ఘటనను కూడా గుండె నిబ్బరంతో ఎదుర్కొన్నానని అన్నారు.
Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..
అందుకు రెండేళ్ల క్రితం అసెంబ్లీలో కౌరవ సభలో ఉండనని, ప్రజలు గెలిపిస్తే మరల అసెంబ్లీని గౌరవ సభగా మార్చి వస్తానని చెప్పా.. ప్రజలు కూడా సహాకరించారని చంద్రబాబు అన్నారు. కూటమి నేతలంతా.. ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేశామని అన్నారు. ముఖ్యంగా.. ప్రధాని మోదీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరీ లకు చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది తమ పార్టీ కార్యకర్తల సమిష్టి విజయమన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter