Nara lokesh: పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ‌: లోకేశ్‌

Nara Lokesh says some Police officers are acting unilaterally : ఏపీలో డ్రగ్స్‌, (Drugs‌) గంజాయి మాఫియా పెరిగిందని లోకేశ్‌ అన్నారు. వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ పట్టుకున్నా కూడా ఏపీకి (Andhra Pradesh‌) సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2021, 08:45 PM IST
  • పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..
  • ఏపీలో డ్రగ్స్‌, గంజాయి మాఫియా పెరిగింది
  • టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
Nara lokesh: పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ‌: లోకేశ్‌

TDP leader Nara Lokesh says some Police officers are acting unilaterally in Andhra Pradesh‌ : ఆంధ్రప్రదేశ్‌లో కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో డ్రగ్స్‌, (Drugs‌) గంజాయి మాఫియా పెరిగిందని లోకేశ్‌ అన్నారు. వైఎస్సార్సీపీ నేతల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ పట్టుకున్నా కూడా ఏపీకి (Andhra Pradesh‌) సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌, గంజాయి మాఫియా పెరిగిందన్నారు లోకేశ్. ఏపీ నుంచి ఎక్కువగా గంజాయి వస్తుందని హైదరాబాద్‌ సీపీ చెప్పారన్నారు ఆయన. గంజాయి నివారణలో ఏపీ పోలీసులకు (AP police) చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దాడులు చేసినంత మాత్రాన తాము భయపడమని చెప్పారు. 

Also Read : Kodali Nani : వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : కొడాలి నాని

టీడీపీ కార్యాలయంపై (TDP office) దాడికి పాల్పడిన దుండగుల కార్లు డీజీపీ కార్యాలయం (DGP Office) మీదుగానే వచ్చాయని ఆరోపించారు. మఫ్టీలో ఉన్న పోలీసులను పంపించి దాడులు చేయించారని లోకేశ్ ఆరోపించారు. తమ అధినేతకు ఉన్న సహనం తనకు లేదని.. వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ (Lokesh)హెచ్చరించారు. 

Also Read : IND Vs AUS warm-up match: ఆస్ట్రేలియాపై వార్మప్​ మ్యాచ్​‌లోనూ India విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News