Chandrababu Naidu: చంద్రబాబుకు బిగ్‌ రిలీఫ్.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్

Chandrababu Naidu Gets Regular Bail: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ లభించింది. ప్రస్తుతం మధ్యంత బెయిల్‌పై ఉన్న చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్ మంజూరు అయింది. దీంతో ఈ నెల 28న రాజమండ్రి జైలుకు లొంగిపోవాల్సిన అవసరం లేదు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 20, 2023, 03:41 PM IST
Chandrababu Naidu: చంద్రబాబుకు బిగ్‌ రిలీఫ్.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్

Chandrababu Naidu Gets Regular Bail: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి బిగ్‌ రిలీఫ్ లభించింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరవ్వగా.. రెగ్యులర్‌ బెయిల్‌గా మారుస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులర్ మంజూరు కావడంతో ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఈ నెల 30వ తేదీన ఏసీబీ కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించిన వాదనలు ఈనెల 17న ముగియగా.. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా.. CID తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. సోమవారం బెయిల్ మంజూరు చేస్తో తీర్పును వెల్లడించింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్‌ 9న నంద్యాలలో చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యూడీషియల్ రిమాండ్‌లో భాగంగా 52 రోజులపాటు ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. కంటి చికిత్స కోసం అక్టోబర్ 31న నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న చంద్రబాబుకు ఇటీవల కంటి ఆపరేషన్ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు నేడు బెయిల్ మంజూరు చేశారు.

ఈ కేసులో సీఐడీ తరఫున అదనపు AG పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారని అన్నారు. హైదరాబాద్‌లో ర్యాలీలు నిర్వహించారని.. ఈ విషయంపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. లొంగిపోయే సమయంలో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌ కవర్‌లో వైద్యనివేదికలు అందజేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారని వాదించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవని. బెయిల్‌ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని అన్నారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్ మంజూరు అయిందనే కారణంతో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలనే కోరడం సరికాదన్నారు. బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు. 

చంద్రబాబు తరఫున వాదనలు వినిపించి న్యాయవాదులు.. ఏపీ సీఐడీ రాజకీయ పెద్దలు చెప్పినట్లు నడుకుంటోందన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని.. రాజకీయ నేతలు చెప్పినట్లు కాదన్నారు. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం, CID ఉద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని వాదించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. సోమవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Also read: Team india Pics: కంట కన్నీరు, విషన్న వదనాలు, బరువెక్కిన గుండెతో టీమ్ ఇండియా ఆటగాళ్లు

Also read: Vijayakanth : తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన తమిళ సీనియర్ హీరో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News