AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి రామచంద్రయ్య..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ హయాంలో జరిగిన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తెలుగుదేశం అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి(Chandrababu naidu)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య సవాలు విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ( Ysr congress party ) ప్రభుత్వంపై విమర్సలు చేసే ముందు..తన హయాంలో జరిగిన రాష్ట్రాభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సి రామచంద్రయ్య ప్రశ్నించారు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు నానా హంగామా చేశారని..ఇది చాలదన్నట్టు ప్రపంచమంతా తిరిగారన్నారు. అయినా సరే రాష్ట్రానికి ఏం ఒరగలేదని..అడ్డగోలుగా ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి..రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారన్నారు.
రాష్ట్రంలో అమరావతిని మరో సింగపూర్‌లా మారుస్తున్నానంటూ గ్రాఫిక్స్‌తో కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పరిపాలనకు ఆయన చేసిన మోసానికి కేవలం అధికారం కోల్పోవడమే కాకుండా..ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని సి రామచంద్రయ్య(C Ramachandraiah) గుర్తు చేశారు. వైఎస్ జగన్ (Ys jagan) పాలనలో రాష్ట్రంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అన్ని వర్గాలు ఆత్మ విశ్వాసంతో ఉన్నాయని..చంద్రబాబు మాయమాటల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.
Also read: Tirupati Bypoll: కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా వైఎస్ జగన్ తిరుపతి సభ రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook