Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఇకపై వృద్ధులకు అనుమతి!

Tirumala Darshan: కరోనా సంక్షోభం కారణంగా తిరుమలలో ఆగిపోయిన ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శనాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపుగా రెండేళ్ల తర్వాత వృద్ధులు, వికలాంగులకు, బాలింతలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాన్ని ఇకపై అందుబాటులోకి తీసుకురానున్నారు. దానికి సంబంధించి టీటీడీ ఓ ప్రకటన చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 11:43 AM IST
Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఇకపై వృద్ధులకు అనుమతి!

Tirumala Darshan: కరోనా సంక్షోభం కారణంగా రెండేళ్ల క్రితం పత్యేక దర్శనాలు సహా ఆర్జిత సేవలను తిరుమల తిరుమతి దేవస్థానం రద్దు చేసింది. దాదాపుగా రెండేళ్ల తర్వాత వాటిని ఇటీవలే టీటీడీ తిరిగి ప్రారంభించింది. ఇటీవలే ఎలక్ట్రానిక్ డిప్, సర్వ దర్శనం, స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మరోవైపు గతంలో వృద్ధులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టిన టీటీడీ.. ఇప్పుడు ఆ దర్శన ఏర్పాట్లు తిరిగి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ పత్యేక దర్శనం కింద వృద్ధులు, వికలాంగులు, ఒక సంవత్సరం లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రత్యేక ప్రవేశ ద్వారం దర్శనానికి అనుమతించనున్నారు. కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో ఈ ప్రత్యేక దర్శనానికి సంబంధించిన నిర్ణయాన్ని టీటీడీ తీసుకుంది. 

ఏఏ సమయాల్లో దర్శనానికి అనుమతి

ఈ దర్శనం కోసం సోమవారం నుంచి గురువారం వరకు.. ఆ తర్వాత శనివారం ఉదయం 10 గంటలకు, ఆలయ దక్షిణ మాడవీధిలో ప్రత్యేక క్యూలో ప్రవేశం కల్పించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే ఈ దర్శనానికి అనుమతి ఉంది. ఈ ద్వారం గుండా ప్రతిరోజూ వేలాది మందికి శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించింది.  

Also Read: Bus Accident: భాకరాపేట ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు పరిహారం

Also Read: Huzurnagar Election: హైకోర్టులో మరో స్టే తెచ్చుకున్న ఏపీ సీఎం జగన్.. ఏప్రిల్ 26 వరకు అనుమతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News