Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు.. మార్కెట్‌ విలువ రూ.40 లక్షల వరకు..!

House Site Pattas To TTD Employees: ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల ఎట్టకేలకు నెరవేరింది. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వేలాది మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందజేయడం ఆనందంగా ఉందని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2023, 05:20 PM IST
Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు.. మార్కెట్‌ విలువ రూ.40 లక్షల వరకు..!

House Site Pattas To TTD Employees: ఉద్యోగుల సంక్షేమం, ధార్మిక ప్రచారంలో వెనుకడుగు వేసేది లేదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు  భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన  కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. వేలాదిమంది ఉద్యోగులకు తన చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 17 ఏళ్ల క్రితం తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయమై చర్చించినట్లు గుర్తు చేసుకున్నారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటిస్థలాలు మంజూరు చేసినట్టు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని అన్నారు.

తాను 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు టీటీడీ విద్యాసంస్థల్లోనే చదివానని కరుణారరెడ్డి తెలిపారు. ఉద్యోగులు అందరికీ ఇంటి స్థలాలు అందజేసే విషయంపై సీఎం జగన్‌తో మాట్లాడినప్పుడు.. ఉద్యోగులందరికీ ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారని అన్నారు. అయితే చట్టపరంగా ఇబ్బందులు ఉండడంతో నామమాత్రపు ధరతో ఇవ్వాలని నిర్ణయించిన్లు తెలిపారు. ఉద్యోగులతోపాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి పట్టాలు మంజూరు చేసేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు.  

పాగాలి వద్ద 350 ఎకరాల భూమి టీటీడీకి ఇవ్వడంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి కృషి అభినందనీయని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో రూ.87 కోట్లు మంజూరు చేయించడంలో ఈవో ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పారు. ఉద్యోగులు అందరూ కూడా శ్రీవారి దయతోనే ఇక్కడ ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకుని.. భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

అనంతరం ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేలా ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాల కోసం 210 కోట్ల రూపాయలు ఉద్యోగుల తరఫున చెల్లించడం చారిత్రాత్మకమన్నారు. పాగాలి వద్ద 350 ఎకరాలు త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని.. జనవరి చివరి నాటికి టీటీడీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వడమాలపేట దగ్గర ప్రస్తుతం ఉద్యోగులకు ఇస్తున్న ఇంటి స్థలం మార్కెట్ విలువ రూ.40 లక్షలకు చేరుకుందన్నారు. HBL వారికి కూడా ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. రెండో విడతగా మరో 15 రోజుల్లో ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం మహతి ఆడిటోరియంలోనే నిర్వహిస్తామన్నారు. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Oneplus Nord Ce 3 5G Price: అమెజాన్‌లో సగం ధరకే Oneplus Nord Ce 3 5G మొబైల్‌..అదనంగా రూ.18,900 తగ్గింపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News