Weather update: ఏపీలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

Rain in next 48 hours: ఏపీలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 10:18 AM IST
  • ఏపీలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు
  • ఈ నెల 26న ఈశాన్య రుతుపవనాల ప్రవేశం
  • రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలు
Weather update: ఏపీలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

Andhrapradesh can expect more rain in next 48 hours: Meteorological department : ఏపీలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (Meteorological Centre) తెలిపింది. నైరుతి రుతుపవనాల (Southwest monsoon) నిష్క్రమణ చివరి దశకొచ్చింది. రెండురోజుల్లో పూర్తిగా నిష్క్రమించనున్నాయి. ఈ నెల 26న నైరుతి నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు (Northeast monsoon) ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీలోని (Andhrapradesh) ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో అనేక చోట్ల శనివారం భారీ వర్షాలు కురిశాయి. ఎర్రగొండపాలెం, ఉదయగిరి, కనిగిరి, తిరుపతి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

Also Read : India vs Pakistan T20 World Cup Match: పాక్‌తో తొలిపోరు నేడే, టీమ్ ఇండియా తుది జట్టు

ఇక ఈ నెల 26న ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల రాక ప్రారంభం కానుండడంతో అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి తేమ రాష్ట్రం వైపు వస్తోంది. దీంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో (Rayalaseema) అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ఇక ఈశాన్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని (Odisha) కొన్ని ప్రాంతాలు, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతం మొత్తం, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో (Telangana) కొన్ని ప్రాంతాలు, కర్ణాటక మధ్య అరేబియా సముద్రం ఏరియాలో మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరోగమించాయి. అక్టోబర్ 26, 2021న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో (India) ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నందు వల్ల నైరుతి రుతుపవనాలు మొత్తం దేశం నుంచి తిరోగమిస్తాయి.

Also Read : India vs Pakistan: ప్రత్యర్ధి దేశాల మధ్య నేడే పోరు, భారీ స్క్రీన్‌లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News