Swarnandhra Vision 2047: 'విజన్ 2047 పేరుతో చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు అని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలని చెప్పారు. విభజన హామీలు నెరవేరేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Schools Holiday: భారీ వర్షాల ప్రభావం.. ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించిన విజన్ -2047పై వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. విజన్ కాదు విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పదేళ్లుగా విభజన హామీలను గాలికి వదిలేశారని..పూర్తిగా అటకెక్కించారని విమర్శించారు. 'విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కొత్త రాజధానికి భారీగా ఆర్థిక సహాయం, వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన' వంటి హామీలు ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు.
Also Read: Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై అక్రమ కేసులు, అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ ట్వీట్
'కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టుల నిర్మాణం. నూతన రైల్వే జోన్, పెట్రోలియం విశ్వవిద్యాలయం, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్ ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయి' అని షర్మిల వివరించారు. ఇవాళ్టికి ఒక్క హామీకి దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. పదేళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవని.. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేదని చెప్పారు. విభజన హామీలు అమలయ్యి ఉంటే రాష్ట్రం దిశ - దశ పూర్తిగా మారేదని తెలిపారు.
'విభజన చట్ట హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి ప్రధాని నరేంద్ర మోడీ అయితే.. రెండో ముద్దాయి చంద్రబాబు.. మూడో ముద్దాయి జగన్ మోహన్ రెడ్డి. ముగ్గురు కలిసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు' అని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 'హోదా పదేళ్లు ఇస్తామని మోడీ నమ్మబలికితే.. హోదా ఏమైనా సంజీవనా అని చంద్రబాబు చెవుల్లో పూలు పెట్టారు' అని గుర్తుచేశారు. 'ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే రాష్ట్రానికి విజన్. మోడీ పిలక మీ చేతుల్లో ఉంది. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి' అని షర్మిల డిమాండ్ చేశారు.
విజన్ 2047 పేరుతో చంద్రబాబు @ncbn గారు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు.…
— YS Sharmila (@realyssharmila) December 14, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.