Best Recharge Plans: దేశంలోని టెలీకం కంపెనీలు వార్షిక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఒక్కో కంపెనీ ఒక్కో ధరకు వివిధ రకాల ప్రయోజనాలతో అందిస్తున్నాయి. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఏడాదికి కేవలం 895 రూపాయలకే లభిస్తున్నాయి. ఈ క్రమంగా ఏ కంపెనీ రీఛార్జ్ ప్లాన్ మంచిదో తెలుసుకుందాం.
రిలయన్స్ జియో ప్రస్తుతం 336, 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఇందులో 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్ ప్లాన్ కేవలం 895 రోజులకే లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మొత్తం 24 జీబీ హై స్పీడ్ డేటా అందుతుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 28 రోజులకు 50 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత యాక్సెస్ పొందవచ్చు. దీంతోపాటు మరో వార్షిక ప్లాన్ 3,599 రూపాయలు. ప్రతి రోజూ 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
ఎయిర్‌టెల్, వోడాఫోన్ వార్షిక ప్లాన్స్
ఇక ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు కూడా ఏడాది వ్యాలిడిటీతో ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ రెండు ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ కేవలం 1999 రూపాయలకే అందిస్తున్నాయి. ఇందులో 24 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.
ఇక బీఎస్ఎన్ఎల్ నుంచి వార్షిక ప్లాన్ 2,999 రూపాయలకు అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో రోజూ 3 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది.
Also read: 8th Pay Commission Date: 8వ వేతన సంఘంపై క్లారిటీ వచ్చేసింది, అదిరిపోయేలా పెరగనున్న జీతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.