కేంద్ర ప్రభుత్వం త్వరలో అంటే మరో 15 రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందనే విషయంపై విభిన్న వర్గాల్లో విభిన్న రకాల అంచనాలున్నాయి. ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి, సామాన్య ప్రజలు చాలా ఆశలున్నాయి. 2023-24 బడ్జెట్‌ను ప్రత్యేకంగా చేసేందుకు వివిధ రకాల మినహాయింపులు ఇవ్వవచ్చని సమాచారం. 2023-23 బడ్జెట్లో ఏ రంగానికి ఏం మేలు జరగనుందనేది తెలుసుకుందాం.
జీడీపీ 7 శాతం చేరవచ్చు
ఐఎంఎఫ్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచ ఎకానమీలో ఇండియా ఓ బ్రైట్ స్పాట్లో ఎదుగుతోంది. జీడీపీ గణాంకాల గురించి మాట్లాడుకుంటే..2021-22లో 8.7 శాతం ఉండగా, 2022-23 లో 7 శాతం చేరవచ్చని అంచనా.
జీడీపీ గ్రోత్ తక్కువే ఉంటుందా
ఒకవేళ సరఫరా సంబంధిత గ్రాస్ వ్యాల్యూ గురించి మాట్లాడుకుంటే ఇందులో అగ్నికల్చర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్ల పాత్ర గణనీయంగా ఉండవచ్చు. గత ఏడాది ఇది 8 శాతం ఉంది. ఈ ఏడాది 6.7 శాతం ఉంది. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జీడీపీ గ్రోత్ రేటు తక్కువగానే ఉండవచ్చు.
మార్కెట్ నిపుణులు అంచనా ఏమిటి
రీసెర్చ్ ఎనాలిస్ట్ ప్రకారం సాధారణ జీడీపీ 2022-23లో 15.4 శాతం ఉంటుంది. 2021-22లో ఇది 19.5 శాతముంది. జీడీపీలో 2022-23లో షేర్ శాతంలో హై కవరేజ్ ఉంటుంది. అంతేకాక ప్రైవేట్ పైనల్ కంజప్షన్ ఎక్స్పెండిచర్ 57.2 శాతం ఉండవచ్చు. అదే ప్రభుత్వ ఫైనల్ కంజప్షన్ ఎక్స్పెండిచర్ 10.3 శాతం, ఎగుమతి 22.7 శాతం, దిగుమతి 29.7 శాతం ఉండవచ్చు.
ఏ రంగంలో మెరుగుదల
అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ , కన్స్ట్రక్చర్, ట్రేడ్, హోటల్ , ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, సర్వీస్ రంగంలో మెరుగుదల ఉండవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook