Income Tax limit: ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్, 2023 బడ్జెట్‌లో ట్యాక్స్ లిమిట్ పెరగవచ్చు

Income Tax limit: ఇన్‌కంటాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్. రానున్న బడ్జెట్‌కు ఇంకా కొద్దిరోజులే మిగిలుంది. యూనియన్ బడ్జెట్‌లో ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ లిమిట్ పెంచేందుకు యోచిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2023, 04:41 PM IST
Income Tax limit: ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్, 2023 బడ్జెట్‌లో ట్యాక్స్ లిమిట్ పెరగవచ్చు

బడ్జెట్ 2023 ట్యాక్స్ పేయర్లకు శుభవార్త విన్పించనుంది. మరి కొద్దిరోజుల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఇన్‌కంటాక్స్ స్లాబ్‌లో మార్పులు చేయనుంది. ట్యాక్స్ ఫ్రీ లిమిట్ పెంచవచ్చని తెలుస్తోంది. 

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేసపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ పేయర్లకు శుభవార్త విన్పించనుంద సమాచారం. ఈసారి ట్యాక్స్ ఫ్రీ లిమిట్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ట్యాక్స్‌ఫ్రీ లిమిట్ ఇప్పటి వరకూ 2.5 లక్షల వరకూ ఉంది. ఇక నుంచి ఈ పరిమితిని 3 లక్షలకు పెంచవచ్చు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యుల్నించి మద్య తరగతి ప్రజలకు ఈ బహుమతి అందించవచ్చు.

3 లక్షల కానున్న ట్యాక్స్‌ఫ్రీ లిమిట్

జీ బిజినెస్ అందిస్తున్న వివరాల ప్రకారం ఈసారి బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లు ఆనందించే విషయాలుండవచ్చు. మరీ ముఖ్యంగా ట్యాక్స్‌ఫ్రీ లిమిట్‌ను పెంచవచ్చు. ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ లిమిట్‌ను 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచవచ్చు. అంటే గతంతో పోలిస్తే ట్యాక్స్ తక్కువ చెల్లిస్తే సరిపోతుంది. 

ట్యాక్స్‌ఫ్రీ లిమిట్ పెరిగి 9 ఏళ్లు

గతంలో చివరిసారిగా ట్యాక్స్‌ఫ్రీ లిమిట్ 2014లో జరిగింది. ఆ సమయంలో ప్రభుత్వం ట్యాక్స్‌ఫ్రీ లిమిట్‌ను 2 లక్షల నుంచి 2.5 లక్షలకు పెంచింది. గత 9 ఏళ్లుగా ఈ లిమిట్‌లో ఏ విధమైన మార్పు రాలేదు. మోదీ రెండవ దఫా ప్రభుత్వంలో ఇదే చివరి సంపూర్ణ బడ్జెట్. ఈసారి కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటనలు చేయవచ్చు.

సీనియర్ సిటిజన్లకు 3 లక్షల వరకూ లిమిట్

ఇప్పటి వరకైతే 2.5 లక్షల వరకూ ఏ విధమైన ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ వెసులుబాటును 50 వేల రూపాయలు పెంచవచ్చు. అటు సీనియర్ సిటిజన్లకు ఈ లిమిట్ 3 లక్షల రూపాయలుంది. 

ఇప్పుడున్న ట్యాక్స్ లిమిట్

ఏడాదికి 2.5 లక్షల వరకూ ట్యాక్స్ ఫ్రీ
2.5 లక్షల నుంచి 5 లక్షల వరకూ 5 శాతం ట్యాక్స్
5 లక్షల నుంచి 10 లక్షల వరకూ 20 శాతం ట్యాక్స్
10 లక్షలకు పైన 30 శాతం ట్యాక్స్

Also read: Union Budget 2023: ఈసారి బడ్జెట్‌లో ఏ రంగంలో ఎంతవరకూ ఉపశమనం, ఏయే వెసులుబాట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News