Elon Musk ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగలోలు చేసిన తర్వాత ట్విట్టర్ పిట్ట వార్తల్లో నిలవని రోజు అంటూ లేదు. రోజుకో వార్తతో ట్విట్టర్ పేరు మార్మోగిపోయింది. దీంతో ఎవరి నోట విన్న ట్విట్టర్ వార్తలే వినిపించాయి. టెక్లా సంస్థకు అధిపతిగా ఉన్న ఎలన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలుతో ఒక్కసారిగా ప్రపంచ సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయారు. అప్పటి వరకు ఆయన గురించి తెలియని వాళ్లు కూడా మస్క్ కోసం నెట్టింట్లో తెగ సర్చ్ చేశారు. అంతా ఆయన పాపులర్ అయిపోయారు. అయితే ఇంత జరిగిన తర్వాత మస్క్ ఒక్కసారిగా వెనుకడుకు వేశారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్న ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఇంత కాలం మస్క్ గురించి ట్విట్టర్ గురించి తెగ మాట్లాడేసుకున్న వాళ్ల అంతా అవాక్కు అయ్యారు.
ట్విట్టర్ కు ఉన్న ఫాలోవర్స్ సంఖ్య చూసే తాను ట్విట్టర్‌ను టేకోవర్ చేసినట్లు చెప్పుకొచ్చిన మస్క్... ఇప్పుడు తనకు చాలా అనుమానాలు ఉన్నాయని అంటూ మెళికపెట్టాడు. ట్విట్టర్ ఖాతాదారుల్లో నకిలీలు ఎంత మందో ముందు తేలాలని డిమాండ్ చేస్తున్నాడు. ముందు ఈ నకిలీల లెక్క తెలిస్తే ట్విట్టర్‌ను టేకోవర్ చేయాలా వద్దా అనే నిర్ణయించుకుంటానని కొత్త వాదం తెరపైకి తీసుకొచ్చాడు. రూ.34.09 లక్షల కోట్లు పెట్టి కొన్న తనకు ఈ మాత్రం తెలుసుకునే హక్కు లేదా అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయం తేలే వరకు ట్విటర్‌ను కొనుగోలు అంశాన్ని‘తాత్కాలికం’గా పక్కన పెడుతున్నట్టు మస్క్ ట్వీట్ చేశాడు. దీంతో ఇక ఈ డీల్ అమలుకు నోచుకుంటుందా? లేక? ఈ అనుమానాల సుడిగుండంలో కొట్టుకుపోతుందా అని అంతా గుసగుసలాడుకుంటున్నారు.
మొత్తం ట్విటర్ ఖాతాదారుల్లో సుమారు ఐదు శాతం మంది నకిలీ సభ్యులు ఉన్నారని పలు సంస్థలు నిర్దారించాయి. సోషల్ మీడియా అన్న తర్వాత ఎంతో కొంత శాతం నకిలీ ఖాతాదురులు ఉండడం సహజమని ట్విట్టర్ కూడా ప్రకటించింది. ఈ నకిలీ ఖాతా దారుల సంఖ్య అంత ఎక్కువ ఏమి కాదని వాదిస్తోంది. ఇలా ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిరితే తప్ప ట్విట్టర్ డీల్ ముందుకు సాగేటట్లు కనబడడం లేదు.
also read Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధరలు...
also read Dubai Flight Fare: దుబాయ్ ప్రయాణానికి పెరిగిన డిమాండ్.. రూ.6 వేలకే ఫ్లైట్ టికెట్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook