సైబర్ నేరగాళ్లు మరియు హ్యాకర్లు మోసాలు చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తుంటారు. నకిలీ ఆఫర్లతో మీ వ్యక్తిగత డేటా మరియు బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి ఈ మధ్య వాట్సాప్ మెసేజింగ్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా వంద మంది వినియోగదారులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్, ఇతర బహుమతులు ఇస్తున్నారంటూ కొన్ని ఫేక్ మెస్సేజ్‌లు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి.
దీనిపై ఫాక్ట్ చెకింగ్ వెబ్సైట్ అయిన న్యూస్‌మీటర్ వెల్లడించిన నివేదిక ప్రకారం, వాట్సాప్ వినియోగదారులు అందుకుంటున్న ఈ అమెజాన్ 30 సంవత్సరాల బహుమతుల మెస్సేజ్ పూర్తిగా అవాస్తవం. అందులో చెప్పినట్లుగా ఏ బహుమతులు, గిఫ్ట్‌లను అమెజాన్ కస్టమర్లకు అందించడం లేదు. అమెజాన్ కస్టమర్ సర్వీస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ‘అమెజాన్ 30 వ వార్షికోత్సవ వేడుక’ అని ఆ వాట్సాప్(WhatsApp) మెస్సేజ్ వైరల్ అవుతోంది. అక్కడ కనిపించిన నకిలీ URLను కొందరు క్లిక్ చేస్తున్నారు. కానీ ఇది ఖచ్చితంగా అమెజాన్ వెబ్‌సైట్‌కు వెళ్లదు.
నివేదిక ప్రకారం, వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేసే వ్యక్తులను అధికారిక అమెజాన్ వెబ్సైట్ మాదిరిగానే కనిపించే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో వంద మంది అదృష్టవంతులైన వినియోగదారులకు యాదృచ్ఛికంగా కంపెనీ హువావే మేట్ ప్రో 5Gని బహుమతిగా ఇస్తుందని హ్యాకర్లు వాట్సాప్ వినియోగదారులకు సూచిస్తున్నారు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరు ఈ ప్రమోషన్ల గురించి ఐదు గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు చెప్పండి, ఆపై వారి చిరునామాను నమోదు చేసి, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ బహుమతి 5-7 రోజుల్లో మీకు ప్రదానం చేయనున్నామని వివరాలు కనిపిస్తాయి.
వాట్సాప్ సందేశాల ద్వారా స్మార్ట్‌ఫోన్(Smartphones) వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోవడానికి ఇది ఒక మార్గంగా సైబర్ నేరగాళ్లు ఎంచుకున్నారు. ఈ క్రమంలో బహుమతులు అంటూ ఫేక్ మెస్సేజ్‌లు షేర్ చేసి వాట్సాప్ వినియోగదారుల డేటాను చోరీ చేస్తున్నారు. కనుక దయచేసి ఈ వాట్సాప్ ఫార్వార్డ్ మెస్సేజ్‌ను ఇతరులకు షేర్ చేయవద్దనీ, మీరు సైతం ఈ లింక్ మీద క్లిక్ చేయకూడదని సూచిస్తున్నారు. ఈ రకమైన వాట్సాప్ సందేశాలు మీకు వస్తే కచ్చితంగా అధికారిక వెబ్సైట్లో వివరాలు చెక్ చేసుకోవాలని, దాని వల్ల వాస్తవాలు తెలుసుకోగలుగుతారని పేర్కొన్నారు.
Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook