Today Gold Rate August 20: భారీగా పెరిగి ఇప్పుడిలా.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే

Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Aug 20, 2024, 07:16 AM IST
Today Gold Rate August 20:  భారీగా పెరిగి ఇప్పుడిలా.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే

Today Gold Rate in Telugu States: బంగారం ధరలు ఆగస్టు 20, మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయినప్పటికీ బంగారం ధరలు గత వారంతో పోల్చినట్లయితే, గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర  72,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,700 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విజయవా, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

గత రెండు రోజులుగా బంగారం వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. బంగారం ధరలు పెరిగినా..తగ్గినా పసిడి ప్రియులు మాత్రం షాపుల ముందు క్యూ కడుతున్నారు. అటు  ప్రధానంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరగడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ కస్టమర్లు మాత్రం గడచిన వారంతో పోల్చి చూసినట్లయితే, భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు.

బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అమెరికా నెలలో తీసుకునే కొన్ని నిర్ణయాలు కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ నెలలో భేటీ సందర్భంగా కీలక వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గించవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో మధుపరులు పెద్ద ఎత్తున బంగారం వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్ కీలక వడ్డీ రేటులను తగ్గించినట్లయితే, అమెరికా విడుదల చేసే యూఎస్ ట్రెజరీ బాండ్లకు విలువ తగ్గుతుంది. అలాంటప్పుడు వాటి నుంచి వచ్చే రాబడి కూడా తగ్గడంతో నిపుణులు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తుంటారు.  దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు డిమాండ్ పెరిగి బంగారం ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read : Reproduction Without Mating: జంతు ప్రపంచంలో సంభోగం లేకుండా జన్మనిచ్చే  జీవులు ఏవో తెలుసా

పెరుగుతున్న బంగారం ధర ఎవరికి లాభం అందిస్తుంది : 

 పెరుగుతున్న బంగారం ధరలు ఓవైపు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి కనీళ్లు పెట్టిస్తున్నప్పటికీ,  బంగారంలో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం లాభాలను పంచుతుంది.  బంగారంలో పెట్టుబడి విషయానికి వచ్చినట్లయితే చాలామంది ఆభరణాలు కొనుగోలు మాత్రమే అనుకుంటారు.  కానీ ప్రస్తుత కాలంలో బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు  ఉన్నాయి.   కేంద్ర ప్రభుత్వం జారీ చేసే బంగారం బాండ్లు కొనుగోలు చేయడం ద్వారా కూడా మనం బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్  గోల్డ్ బాండ్ల పేరిట ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బాండ్లను జారీ చేస్తుంది.  వీటిలో పెట్టుబడి పెడితే మీకు వడ్డీ కూడా లభిస్తుంది.

అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ ల రూపంలో కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు.  ఇందులో కూడా మీరు ప్రత్యేకంగా ఫిజికల్ రూపంలో బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.  మార్కెట్లో పెరుగుతున్న బంగారం ధరల నుంచి  లాభాలను పొందాలంటే ఇది సరైన మార్గం అని చెప్పవచ్చు.

Also Read : Ola Electric Mobility: మార్కెట్లో టాప్ గేర్‎లో దూసుకుపోతున్న ఓలా షేర్...6 సెషన్లలో 92% పెరుగుదల

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News