Gold Rate: భగ్గుమంటున్న బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా ఉన్న గోల్డ్‌ రేట్స్‌ ఇవే..!

Gold Rate: పసిడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇలా అయితే ఎలా కొంటాం అని బాధపడుతున్నారు మధ్యతరగతి జనం. పెళ్లిళ్ల నేపథ్యంలో బంగారం కొనాలనుకున్న వారికి ప్రత్యేకంగా మహిళలకు బంగారం ధరలు షాకిస్తున్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 12, 2024, 12:46 PM IST
Gold Rate: భగ్గుమంటున్న బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా ఉన్న గోల్డ్‌ రేట్స్‌ ఇవే..!

Gold Rate: పసిడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇలా అయితే ఎలా కొంటాం అని బాధపడుతున్నారు మధ్యతరగతి జనం. పెళ్లిళ్ల నేపథ్యంలో బంగారం కొనాలనుకున్న వారికి ప్రత్యేకంగా మహిళలకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. ఊహకందని విధంగా పైపైకి లేస్తున్నాయి. తులం బంగారం కొనాలంటే దగ్గరదగ్గర లక్ష రూపాయలు ఉండాల్సిందేనా? అనే పరిస్థితికి చేరుకుంది. ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తులం బంగారం రేటు ఏకంగా ఆల్‌ టైం రికార్డు సృష్టించింది. ఇక వెండి కూడా అదే బాటలో వెళ్తోంది.తులం బంగారం ధర (10 గ్రాములు) 24 క్యారట్లు రూ.73,660 కు చేరుకుంది. 

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

ముంబై..
ఈ బంగారం ధరలు ఈరోజు అంటే 2024 ఏప్రిల్ 12 నాటివి. ముంబై నగరంలో 24 క్యారట్ల బంగారం ధర రూ.7,223 నమోదు చేసింది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.6621 వద్ద ఉంది.

కొల్‌కత్త..
బంగారం ధరలు కొల్‌కత్తలో గ్రాము 24 క్యారట్ల విషయానికి వస్తే రూ. 7,223 వద్ద ఉంది. 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6621 ఉంది. 

చెన్నై..
చెన్నైలో 24 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ.7,337 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ. 6,726 కు చేరుకుంది.

ఢిల్లీ..
ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం ధర రూ. 7,238 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ.6,636 వద్ద ఉంది.

బెంగళూరు..
24 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ.7,223 నమోదు కాగా, 22 క్యారట్ల బంగారం ధర రూ. 6,621 వద్దకు చేరుకుంది.

హైదరాబాద్..
బంగారం ధరలు 24 క్యారట్లు హైదరాబాద్‌లో రూ. 7,223 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,621 చేరుకుంది. 

గురుగ్రామ్‌.. 
24 క్యారట్ల బంగారం ధర రూ. 7,238 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,636 చేరుకుంది.

లక్నో..
లక్నోలో 24 క్యారట్ల బంగారం ధర రూ. 7,238 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,636 చేరుకుంది.

అహ్మదాబాద్..
24 క్యారట్ల బంగారం ధర రూ. 7,228 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,626 చేరుకుంది.

ఇదీ చదవండి: బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు.. ఇకపై ఆ సమాచారం తప్పనిసరి!

జైపూర్..
జైపూర్‌లో 24 క్యారట్ల బంగారం ధర రూ. 7,238 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,636 చేరుకుంది.

థానే..
24 క్యారట్ల బంగారం ధర రూ. 7,223 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,621 చేరుకుంది.

సూరత్‌..
24 క్యారట్ల బంగారం ధర రూ. 7,228 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,626 వద్దకు చేరుకుంది.

ఇదీ చదవండి: ఎఫ్‌డీలపై బంపర్ ఆఫర్.. భారీగా వడ్డీ రేట్లు పెంచేసిన బజాజ్ ఫైనాన్స్

పూణే..
పూణేలో 24 క్యారట్ల బంగారం ధర రూ. 7,223 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,621 చేరుకుంది.

నాగ్‌పూర్..
24 క్యారట్ల బంగారం ధర రూ. 7,223 వద్ద ఉండగా , 22 క్యారట్ల బంగారం ధరలు రూ. 6,621 చేరుకుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News