Gold Price Today In India: పెరిగిన బంగారం ధర, భారీగా పతనమైన వెండి ధరలు

Gold Price Today In India |  బంగారం ధరలు (Gold Rate Today) గత వారం రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు మాత్రం భారీగా దిగొచ్చాయి. వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇటీవల రూ.65 వేల మార్కు చేరుకున్న వెండి ధర మరోసారి రూ.61వేలకి దిగొచ్చింది.

Last Updated : Nov 10, 2020, 07:47 AM IST
  • బులియన్ మార్కెట్‌లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,020
  • మార్కెట్లో ఒక్కరోజే రూ.4,400 దిగొచ్చిన 1 కేజీ వెండి ధర
Gold Price Today In India: పెరిగిన బంగారం ధర, భారీగా పతనమైన వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) గత వారం రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు మాత్రం భారీగా దిగొచ్చాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) రూ.640 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,020కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.580 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,600 అయింది.

 

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Price in Delhi) పెరుగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.210 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.55,250 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,650 వద్ద ట్రేడ్ అవుతోంది.

 

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) భారీగా దిగొచ్చాయి. దీంతో కేజీ వెండి ధర రూ.65 వేల నుంచి రూ.61 వేలకు పతనమైంది. తాజాగా వెండి ధర రూ.4,400 మేర భారీగా దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,000కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News