Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం ధరలు

మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా దిగొచ్చాయి. మరోవైపు మార్కెట్‌లో వెండి ధరలు సైతం భారీగా పతనమయ్యాయి. తాజాగా వెండి ధర రూ.1200 మేర భారీగా తగ్గింది.

Last Updated : Oct 14, 2020, 07:24 AM IST
  • బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర, క్షీణించిన వెండి ధరలు
  • కరోనా వ్యాప్తి సమయంలో తాజాగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
  • ప్రస్తుతం మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.62,600కి చేరుకుంది
Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా దిగొచ్చాయి. మరోవైపు మార్కెట్‌లో వెండి ధరలు సైతం భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.220 మేర అతి స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,090 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.220 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,650కి పడిపోయింది.

 

 

ఢిల్లీలో మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) నేడు దిగొచ్చాయి. తాజాగా బంగారం ధర రూ.350 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,080కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,550 అయింది.

 

బులియన్ మార్కెట్‌లో మరోవైపు అకాశాన్నంటుతున్న వెండి ధరలు (Silver Rate in India) తగ్గాయి. తాజాగా వెండి ధర రూ.1200 మేర భారీగా తగ్గింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,600కి పతనమైంది. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News