Gold Price Today In Hyderabad: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు మళ్లీ పతనం

తాజాగా మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో నవంబర్ నెల చివర్లోనూ బంగారం ధరలు (Gold Rate Today) దిగొస్తున్నాయి.

Last Updated : Nov 30, 2020, 07:58 AM IST
  • బులియన్ మార్కెట్‌లో తగ్గుతున్న బంగారం ధరలు
  • తాజాగా బంగారం ధర రూ.49 వేలకు పడిపోయింది
  • మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.59,610
Gold Price Today In Hyderabad: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు మళ్లీ పతనం

బులియన్ మార్కెట్‌లో నవంబర్ నెల చివర్లోనూ బంగారం ధరలు (Gold Rate Today) దిగొస్తున్నాయి. తాజాగా మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) రూ.500 మేర తగ్గింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,100 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,010కి పతనమైంది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌ సైతం సాధారణంగా ఉంది. బంగారం ధరలు (Gold Price in Delhi) వరుసగా రెండో వారం దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలు రూ.400 మేర తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,430కి పడిపోయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.340 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,160 అయింది.

Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే..

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నెలలో అధిక రోజులు దిగిరాగా.. వెండి ధర మిశ్రమంగా ఉంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) స్థిరంగా కొనసాగుతోంది. దీంతో బులియన్ మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.59,610 వద్ద మార్కెట్ అవుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఇదే ధరలో వెండి ట్రేడింగ్ జరుగుతుంది.

Also Read : Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ Monal Gajjar ప్రతి వారం ఎలా సేవ్ అవుతుందో తెలుసా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

More Stories

Trending News