Gold Rate Today 19 April 2024: గత వారం పది రోజులుగా బంగారు ధరంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వారం రోజులు దాదాపు 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల కు 74 వేలకు పైగా నమోదు చేశాయి. మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి బంగారం ధరలు లక్ష రూపాయలు కూడా దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.
బంగారం అంటే బంగారమే గోల్డ్ రేట్స్ పెరుగుతుంటే సామాన్యుడు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మధ్యతరగతి వారు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడ్డాయి. మహిళలకు బంగారం ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బు ఉన్న బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.అయితే పెరుగుతున్న బంగారం ధరలు వారిలో దడ పుట్టిస్తున్నాయి. బంగారం కొనాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఏ పెళ్లిలో పేరంటాలు వస్తే బంగారం పెట్టాలన్న కొనుగోలు చేయాలన్నా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు నగరాలు వారిగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
ముంబైలో బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూపాయలు 74,240 ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 68,050 వద్ద ఉంది. ఢిల్లీలో తులం బంగారం ధర అంటే 10 గ్రాములు 24 క్యారెట్లు 74 వేల 390 రూపాయల వద్ద ఉంది 22 క్యారెట్ల తులం బంగారం 68,210 వద్ద ఉంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 74,240 వద్ద ఉంది 22 క్యారెట్ల బంగారం తులం 68,050 వద్ద నమోదు చేసింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: గోల్డ్ రేట్స్.. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
నగరం | 24 క్యారట్లు | 22 క్యారట్లు |
హైదరాబాద్ | రూ. 74,240 | రూ. 68,050 |
చెన్నై | రూ.75,110 | రూ. 68,850 |
బెంగళూరు | రూ.4,240 | రూ. 68,050 |
కోల్ కత్తా | రూ.74,240 | రూ. 68,050 |
జైపూర్ | రూ.74,390 | రూ. 68,210 |
లక్నో | రూ.74,390 | రూ. 68,210 |
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి