ICICI Bank Home Loan Interest Rate : సొంతింతి కల సాకారం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు ఐసీఐసీఐ బ్యాంకు శుభవార్త అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల దారిలోనే ఐసీఐసీఐ పయనిస్తోంది. భారతదేశంలోని అగ్రశ్రేణి రుణాలు అందించే ఎస్‌బీఐ తరహాలోనే ఐసీఐసీఐ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీని 6.70 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
సవరించిన వడ్డీ ఐసీఐసీఐ గృహ రుణాల వడ్డీ రేటు 2021 మార్చి 5 నుండి అమలులోకి వస్తుంది. అదే సమయంలో గత పదేళ్లలో గృహ రుణాలపై ఐసీఐసీఐ అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు(Home Loan Interest Rate) ఇది. ఇంటి కల సాకారం చేసుకోవాలను వినియోగదారులు 6.70 శాతం వడ్డీతో రూ .75 లక్షల వరకు గృహ రుణాలను పొందవచ్చు. రూ .75 లక్షలకు పైగా మొత్తానికి 6.75 శాతం వడ్డీతో రుణాలను అందిస్తోంది. ICICI Bank సవరించిన తాజా వడ్డీ రేట్లు మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటాయి.
Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం
హెమ్ లోన్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్ సెక్యూర్డ్ అసెట్స్ విభాగం అధినేత రవి నారాయణన్ స్పందించారు. గత కొన్ని నెలలుగా, సొంత ఇంటి కోసం రుణాలు తీసుకునేందుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఉన్న తక్కువ వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి సామాన్యులకు ఇదే సరైన సమయం అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ అయినందున తక్కువ సమయంలో సౌకర్యవంతంగా ఇంటిపై రుణాలు పొందవచ్చునని రవి నారాయణన్ పేర్కొన్నారు. అవకాశాన్ని వినియోగించుకుని ఇంటి రుణాలు పొందాలని పేర్కొన్నారు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులతో పాటు ఖాతాదారులు కాని వారు సైతం గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్, మొబైల్ బ్యాంకింగ్ ‘ఐమొబైల్ పే’లో సైతం రుణాలకు దరఖాస్తు చేసుకునే వీలుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంపై అవగాహన లేనివారు నేరుగా ICICI Bankకు వెళ్లి వివరాలు తెలుసుకుని, అన్ని డాక్యుమెంట్లు సమర్పించి కేవలం 6.70 శాతం రేటుతో హోమ్ లోన్ పొందవచ్చు.
Also Read: Wine Shops In Telangana: మందుబాబులకు షాక్, ఆ 2 రోజులు వైన్‌షాప్‌లు బంద్
దేశంలో మొట్టమొదటగా రుణాల్లో 2 ట్రిలియన్ (రూ .2 లక్షల కోట్లు) మార్క్ చేరిన మొట్టమొదటి ప్రైవేట్ రంగ బ్యాంక్‌గా ఐసీఐసీఐ నిలిచింది. నవంబర్ 2020లో ఈ మార్కును ఐసీఐసీఐ అధిగమించింది. బ్యాంక్ తన క్యూ3 ఫలితాలలో డిసెంబర్ నెలలో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఖాతాదారుల ప్రొఫైల్ వివరాలు, కస్టమర్ విభాగం, బ్యూరో స్కోరు ఆధారంగా గృహ రుణ వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు.
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కోటక్ మహీంద్రా బ్యాంక్ మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు సైతం ఇంటి కోసం రుణాలు అందిస్తోంది. 6.70 వడ్డీకే తక్కువ శాతానికి రుణాలు అందిస్తూ ఖాతాదారులను ఆకర్షిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook