Tatkal Ticket Booking Guide: ఈ ట్రిక్స్‌తో ఐఆర్‌సీటీసీ తత్కాల్‌లో టికెట్ ఈజీగా బుక్ చేసుకోండి

Tatkal Quota Ticket Booking: ఐఆర్‌సీటీసీలో తత్కాల్ కోటాలో టికెట్ బుక్ చేసుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. రద్దీగా ఉన్న ట్రైన్లకు అయితే క్షణాల్లో టికెట్లు బుక్ అయిపోతాయి. ఇంత భారీ డిమాండ్‌లో కొన్ని ట్రిక్స్ పాటించి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.  

Written by - Ashok Krindinti | Last Updated : May 16, 2023, 07:36 PM IST
Tatkal Ticket Booking Guide: ఈ ట్రిక్స్‌తో ఐఆర్‌సీటీసీ తత్కాల్‌లో టికెట్ ఈజీగా బుక్ చేసుకోండి

Tatkal Quota Ticket Booking: రైళ్లలో నిత్యం లక్షలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. రైళ్ల రద్దీ ఎప్పుడు భారీగానే ఉంటుంది. ఇక పండుగల వేళ రైళ్లు కిటకిటలాడతాయి. అందుకే చాలా మంది ముందుగా బెర్త్‌లు బుక్ చేసుకుని.. రైళ్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తారు. అప్పటికప్పుడు వెళ్లాలనుకునే వారు తత్కాల్‌లో టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే తత్కాల్‌లో టికెట్ బుక్ అవ్వడం అంత ఈజీగా ఉండదు. టికెట్ బుక్ చేసుకునే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. తత్కాల్ టిక్కెట్లకు ఎప్పుడు భారీగా డిమాండ్ ఉంటుంది. టికెట్లు విడుదలైన 5 నిమిషాల్లో మొత్తం ఖాళీ అయిపోతాయి. రేపు ట్రైన్ ఉందనగా.. ఒక రోజు ముందు తత్కాల్ టికెట్లు ఓపెన్ అవుతాయి. కొన్ని చిట్కాలను పాటించి తత్కాల్ టికెట్లను ఈజీగా బుక్ చేసుకోవచ్చు. 

==> ఏసీ క్లాస్ టిక్కెట్లు (2A/3A/CC/EC/3E) బుకింగ్ విండో ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. నాన్ ఏసీ క్లాస్‌కు (SL/FC/2S) ఉదయం 11 గంటలకు నుంచి బుక్ చేసుకోవచ్చు. 
==> ఐఆర్‌సీటీసీలో తత్కాల్ కోటాలో టికెట్లపై అదనంగా ఛార్జీ ఉంటుంది. సాధారణ టికెట్ కంటే తత్కాల్ టిక్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సాధారణ టిక్కెట్ ధర రూ.900 ఉంటే.. తత్కాల్‌లో  దాదాపు రూ.1300 వరకు ఉంటుంది.
==> ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ irctc.co.in ద్వారా ఆన్‌లైన్‌లో తత్కాల్ ట్రైన్ టిక్కెట్‌ను బుక్ చేసుకోండి
==> ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. మీకు అకౌంట్‌ లేకుంటే.. "సైన్ అప్" బటన్‌ను క్లిక్ చేసి ఖాతాను ఓపెన్ చేసుకోండి. 
==> "బుక్ టిక్కెట్" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> "తత్కాల్" బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకుని.. బయలుదేరే స్టేషన్.. వెళ్లాల్సిన స్టేషన్, జర్నీ డేట్, ట్రైన్, క్లాస్ సహా అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేయండి.
==> ప్రయాణికుల పేరు, వయసు, జెండర్ ఎంటర్ చేయండి
==> మీకు కావాల్సిన బెర్త్‌ను ఎంచుకోండి. లోయర్ బెర్త్‌లు ఎక్కువగా  వృద్ధులకు కేటాయిస్తారు.
==> ఛార్జీలు, ఇతర వివరాలను సమీక్షించి.. చెల్లింపు పేజీకి వెళ్లండి.
==> క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లతో చెల్లించండి.
==> పేమెంట్స్ సక్సెస్ అయిన తరువాత ఈ-టికెట్‌ను డౌన్‌లోడ్ చేయండి 

ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా..

==> మీ స్మార్ట్‌ఫోన్‌లో ఐఆర్‌సీటీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
==> యాప్‌లో మీ ఐఆర్‌సీటీసీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. 
==> తక్షణ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోండి 
==> మీ ట్రైన్, జర్నీ డేట్‌ను ఎంచుకోండి 
==> ప్రయాణికుల వివరాలను ఎంటర్ చేయండి
==> క్లాస్, బెర్త్ ఎంచుకోండి.
==> ఛార్జీల వివరాలను చెక్ చేసుకుని.. బుకింగ్‌ను కన్ఫార్మ్ చేసుకోండి. 
==> క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి పేమెంట్ చెల్లించండి. 
==> పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిన తరువాత యాప్ నుంచి టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

ఈ ట్రిక్స్ పాటించండి..

==> ప్రయాణికుల వివరాలను ముందుగా ఎంటర్ చేసి రెడీగా ఉంచుకోండి. బుకింగ్ సమయంలో మీకు ఈజీగా ఉంటుంది.
==> ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ ద్వారా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా టికెట్ బుక్ చేసుకోవచ్చు. 
==> ఇంటర్‌నెట్ కనెక్టివిటీని ముందే చెక్ చేసుకోండి. నెట్ ఎంత స్పీడ్‌గా ఉంటే.. టికెట్ అంత తొందరగా బుక్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. 
==> బుకింగ్ ఫారమ్‌ను పూరిస్తున్నప్పుడు.. సమయాన్ని ఆదా చేసేందుకు మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ సహ-ప్రయాణికుల వివరాలను కూడా అందుబాటులో ఉంచుకోండి.
==> తక్కువ రద్దీ ఉన్న రైళ్లను ఎంచుకోండి. వీటిలో తత్కాల్ టికెట్లకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. దీంతో మీకు ఈజీగా టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.  
==> తత్కాల్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి. సాధారణ బుకింగ్‌లో సీనియర్ సిటిజన్‌లకు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉండడంతో మీకు తత్కాల్‌లో ఈజీగా టికెట్ పొందే ఛాన్స్ ఉంటుంది. 
==> తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో చాలా ఓపిక ఉండాలి. మొదటి ప్రయత్నంలో విఫలమైందని ఆశలు వదులుకోవద్దు. మీరు ఎంత స్పీడ్‌గా ప్రయత్నిస్తారో మీకు అంత తొందరగా బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 

Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ముంబై జోరుకు లక్నో బ్రేకులు వేస్తుందా..? ప్లే ఆఫ్స్ చేరేది ఎవరు..? డ్రీమ్ 11 టీమ్ ఇలా..  

Also Read: CM Jagan Mohan Reddy: హోల్‌సేల్‌గా అమ్ముకునే వ్యక్తి ప్యాకేజీ స్టార్‌.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఓ లెవల్లో ఉంది: సీఎం జగన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News