New plans: 30 రోజుల వ్యాలిడిటీతో జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్​

New plans: దేశంలోని టెలింకాం దిగ్గజాలు జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియాలు నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్స్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఏ కంపెనీ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎందులో ప్లాన్స్​తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 11:32 PM IST
  • ట్రాయ్​ సూచనలతో టెల్కోల కీలక నిర్ణయం
  • నెల రోజులకు సరిపడా ప్రీ పెయిడ్ ప్లాన్స్..
  • 31 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్​ కూడా అందుబాటులోకి
New plans: 30 రోజుల వ్యాలిడిటీతో జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్​

New plans: దేశంలోని టెలికాం దిగ్గజాలన్నీ కనీసం 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్రీ పెయిడ్​ ప్లాన్స్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటి వరకు మంథ్లీ ప్లాన్ అంటే 28 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​.. గతంలో టెలికాం సంస్థలన్నీ నెల మొత్తం కవర్ అయ్యేలా కనీసం ఒక ప్రీ పెయిడ్​ ప్లాన్ అందుబాటులో ఉండాలని సూచించిన నేపథ్యంలో.. దిగ్గజ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియాలు తమ.. కొత్త ప్లాన్స్​ను అందుబాటులోకి తెచ్చాయి.

జియో నెల రోజుల ప్లాన్..

అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్​ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. రూ.296తో ఈ ప్లాన్​ను కొనుగోలు చేస్తే.. రోజుకు అన్​ లిమిటెడ్ కాల్స్​, 100 ఎస్​ఎంఎస్​లు సహా 25 జీబీ 4జీ డేటా లభిస్తుంది.

ఎయిర్​టెల్ ఆఫర్ ఇలా..

ఎయిర్​టెల్ కూడా రిలయన్స్ మాదిరిగానే రూ.296తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో అందించే ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్​ ద్వారా 25 జీబీ 4జీ డేటా, అన్​ లిమిటెడ్ కాల్స్​, 100 ఎస్​ఎంఎస్​లు (రోజుకు) పొందొచ్చు.

ఇక రూ.319తో కూడిన మరో ప్లాన్​ను కూడా అందుబాటులో ఉంచింది ఎయిర్​టెల్​. దీని ద్వారా ప్రతి రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు, అన్​లిమిటెడ్ కాల్స్​ను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.

వొడాఫోన్ ఐడియా 31 రోజుల ప్లాన్​..

వొడాఫోన్ ఐడియా కాస్త భారీ ధరతో 30 రోజుల ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. రూ.327తో రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత వాయిస్​ కాల్స్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లతోపాటు.. 25 జీబీ డేటాను ఇస్తోంది.

దీనితో పాటు రూ.337తో 31 రోజుల వ్యాలిడిటీ ఇస్తూ మరో ప్లాన్​ను అందిస్తోంది వొడాఫోన్ ఐడియా. దీని ద్వారా రోజుకు 2జీబీ 4జీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లతో పాటు.. అపరిమిత కాల్స్​ను ఆస్వాదించొచ్చని కంపెనీ చెబుతోంది.

Also read: LIC IPO Update: మే మొదటి వారంలోనే ఎల్​ఐసీ ఐపీఓ.. పూర్తి అప్​డేట్స్ ఇవే

Also read: Petrol price: సామాన్యులపై పెట్రో పిడుగు.. 2014తో పోలిస్తే ధరలు ఎంత పెరిగాయో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News